8 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసిన రాయల్ ఒమన్ పోలీస్

- August 21, 2021 , by Maagulf
8 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసిన రాయల్ ఒమన్ పోలీస్

మస్కట్: 8 మంది వలసదారుల్ని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒమన్ ‌సుల్తానేట్‌లోకి వీరంతా అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. కోస్ట్ గార్డ్ పోలీస్ కమాండ్ బోట్లు, 8 మంది చొరబాటుదారుల్ని (ఆసియా జాతీయులు) రెండు బోట్లలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. షినాస్ తీరంలో వీరిని అరెస్ట్ చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com