కేరళ కరోనా అప్డేట్

- August 22, 2021 , by Maagulf
కేరళ కరోనా అప్డేట్

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 17,106 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో ఆగస్టు 21, శనివారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 38,03,903 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 83 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 19,428 కు పెరిగింది.

అదేవిధంగా కొత్తగా 20,846 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 36,05,480 కు చేరింది. దేశంలో ప్రస్తుతం కేరళలోనే అత్యధికంగా 1,78,462 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కేరళలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 3,01,70,011 కు చేరగా, గత 24 గంటల్లోనే 96,481 పరీక్షలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com