మాస్ ప్రకటన కార్డుల ప్రింటింగ్: గ్యాంగ్ అరెస్ట్
- August 23, 2021
అబుధాబి: అబుధాబిలో మూడు ప్రింటింగ్ ప్రెస్‌లు నిబంధనలకు విరుద్ధంగా మసాజ్ కార్డుల్ని ప్రింట్ చేయడంపై అధికారులు కన్నెర్రచేశారు. ఆసియా జాతీయులు ముఠాగా ఏర్పడి ఈ ప్రింటింగ్ ప్రెస్‌లను నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆ కార్డుల్ని అబుదాబి మరియు అల్ అయిన్ ప్రాంతాల్లో పంచుతున్నట్టు గుర్తించారు. ఈ కార్డుల ద్వారా రెసిడెంట్స్‌ని నిందితుల ముఠా ఆకర్షిస్తుంది. ఈ నేర పూరిత చర్యకు సంబంధించి సమాచారం అందడంతో అబుధాబి పోలీస్ ముఠా గుట్టు రట్టు చేసింది. ఇలాంటి అనుమానిత కార్యకలాపాలపై 8002626 నెంబర్ ద్వారా సమాచారం ఇవ్వాలని అబుధాబి పోలీస్ - క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ సుహైల్ అల్ రషీదీ సూచించారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!
- దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: యూఏఈ









