భారత్ పై బ్యాన్ ఎత్తివేసిన ఒమాన్...ప్రయాణీకులు అనుసరించాల్సిన నియమాలు

- August 24, 2021 , by Maagulf
భారత్ పై బ్యాన్ ఎత్తివేసిన ఒమాన్...ప్రయాణీకులు అనుసరించాల్సిన నియమాలు

 మస్కట్: ఒమాన్ కు వచ్చే ప్రయాణీకులందరూ ఒమాన్ లో ఆమోదించబడిన వ్యాక్సిన్ల రెండు డోసులు లేదా సింగల్ డోసు వ్యాక్సిన్లను తీసుకున్నట్లైతే క్యూఆర్ కోడ్‌తో కూడిన కోవిడ్ -19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను సమర్పించాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిఎఎ) ప్రకటించింది. అయితే, ప్రయాణానికి ముందు వ్యాక్సిన్ రెండవ డోసు పూర్తై కనీసం 14 రోజులు అయ్యి ఉండాలి అని అధికార యంత్రాంగం తెలిపింది.  

ప్రీ-ట్రావెల్ రిజిస్ట్రేషన్:
ప్రయాణీకులు తారాసుద్+ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రీ-రిజిస్ట్రేషన్ పూర్తి చేయవలసి ఉంటుంది. QR కోడ్‌లను కలిగి ఉన్న వ్యాక్సిన్ సర్టిఫికెట్‌తో పాటు PCR సర్టిఫికెట్‌ను కూడా అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ ప్రయాణీకులు ఒమాన్ చేరుకున్న తర్వాత PCR టెస్ట్ చేయించుకోదలిస్తే, తారాసుద్ + ప్లాట్‌ఫారమ్ ద్వారా నిర్దేశిత ఫీజులను ప్రయాణానికి ముందే చెల్లించాలి అని సిఎఎ తెలిపింది.

PCR టెస్టులు:
ఒమాన్ కు వచ్చే ప్రయాణీకులు QR కోడ్‌తో కూడిన ప్రీ-ట్రావెల్ PCR పరీక్ష నెగటివ్ రిపోర్ట్ పొందినట్లైతే వారు క్వారంటైన్ నుండి మినహాయింపును పొందుతారు. ఎనిమిది గంటలకంటే ఎక్కువ వ్యవధి గల ప్రయాణాలకు/ ట్రాన్సిట్ లకు, ప్రయాణానికి 96 గంటలలోపు పరీక్ష నిర్వహించాలి. ఎనిమిది గంటలకంటే తక్కువ వ్యవధి గల ప్రయాణాలకు, ప్రయాణానికి 72  గంటలలోపు పరీక్ష నిర్వహించాలి.

PCR పరీక్షను చేయించుకోకుండా ఒమాన్ కు వచ్చే ప్రయాణీకులు వచ్చిన తరువాత PCR పరీక్షకు లోబడి ఉంటారు. అక్కడ ప్రయాణికుడు నెగటివ్ PCR పరీక్ష రిపోర్ట్ వచ్చే వరకు ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ బ్రేస్లెట్ తో తప్పనిసరి క్వారంటైన్ కు నమోదు చేయాలి.

ఒకవేళ PCR పరీక్ష ఫలితం పాజిటివ్ వచ్చినట్లైతే, పరీక్ష తేదీ నుండి 10 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్ పాటించాలి. కోవిడ్ నుండి కోలుకొని, ఒమాన్ వచ్చాక PCR పరీక్ష ఫలితం పాజిటివ్ వచ్చినట్లైతే, కోవిడ్ సోకినా దేశంలో ప్రయాణీకుడు నిర్దేశిత క్వారంటైన్ పూర్తిచేసినట్టు రుజువు చూపిస్తే, క్వారంటైన్ నుండి మినహాయింపు లభిస్తుంది. 

ఎవరిపై ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత?
భారత్,పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు రెడ్-లిస్ట్ చేయబడిన ఇతర 18 దేశాల నుండి ఒమాన్ కు వచ్చే ప్రయాణికులపై ప్రయాణ నిషేధం ఎత్తివేత.

వ్యాక్సిన్ తీసుకొని ఉండాలా?
వ్యాక్సిన్లు రెండు డోసులు తీసుకున్న వారిపై మాత్రమే ఈ ట్రావెల్ బ్యాన్ ను ఎత్తివేసినట్టు ప్రకటన.

ఏ వ్యాక్సిన్లు ఒమాన్ లో ఆమోదింపబడ్డాయి?
ఆస్ట్రాజెనెకా / కోవిషీల్డ్, ఫైజర్, స్పుత్నిక్, సినోవాక్ 

క్వారంటైన్ నియమాలు ఏంటి?
వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తైనవారికి క్వారంటైన్ నుండి మినహాయింపు లభిస్తుంది.

ఎప్పటినుండి ఈ నియమాలు అమలులోకి వస్తాయి?
సెప్టెంబర్ 1, 2021 మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ నియమం అమలులోకి వస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com