తిరుమల శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు విడుదల..

- August 24, 2021 , by Maagulf
తిరుమల శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు విడుదల..

తిరుమల: తిరుమల శ్రీవారి సెప్టెంబర్‌ మాసానికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది. http://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో, గోవిందా యాప్‌ల ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. వాస్తవానికి కోటా ఈ నెల 20న విడుదల కావాల్సిన ఉండగా.. టికెట్ల విడుదల వాయిదా వేసింది. ఆన్‌లైన్‌ 8వేల టికెట్లను అందుబాటులో వచ్చాయి. వచ్చే నెలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను రిలీజ్ చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి http://tirupatibalaji.ap.gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా ఉదయం 09గంటలకు టికెట్లను టీటీడీ విడుదల చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com