ఏపీ కరోనా అప్డేట్

- August 25, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి:ఆంధ్ర ప్రదేశ్‌ లో కరోనా మహమ్మారి కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తునే ఉన్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఈ రోజు కాస్త పెరిగాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1601 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,06,191 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 16 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,766 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,061 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1201 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,78,364 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 71,532 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 62, 70, 356 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com