ప్రవాసీయులకు అందిస్తున్న పురస్కారాలు
- August 25, 2021
ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతుల వికాసానికి పాటుపడుతున్న తెలుగువారిని గౌరవించాలనే ఉద్దేశంతో సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ, వీధి అరుగు వినూత్న కార్యక్రమం ఏర్పాటు చేశాయి.తెలుగు భాషా దినోత్సవం రోజున కొందరికి ప్రవాస తెలుగు పురస్కారాల పేరిట అవార్డులు ప్రదానం చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 75 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.తెలుగు భాషా దినోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
ఈ పురస్కారాలకు నామినేషన్లు పంపేందుకు ఆగస్టు 10 ఆఖరు తేదీ కాగా.. పలు దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారు నానినేషన్లు పంపారన్నారు. తమకు అందిన నామినేషన్లను నిష్ణాతులైన జ్యూరీ పరిశీలించి 12 మందిని పురస్కారాలకు ఎన్నిక చేసిందని వివరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విక్రం పెట్లూరు, వెంకట్ తరిగోపుల,లక్ష్మణ్, తొట్టెంపూడి శ్రీ గణేష్ ఈ పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించారు.ఈ పురస్కారాలను ఆగస్టు 28, 29 తేదీల్లో జరగబోయే తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులు ప్రదానం చేస్తారని తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







