యూఏఈ: కోవిడ్ 19: గండం దాదాపు గట్టెక్కినట్టేనన్న షేక్ మొహమ్మద్
- August 29, 2021
యూఏఈ: ఆగస్ట్ 29న జరిగిన క్యాబినెట్ సమావేశంలో దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పాండమిక్ సమయంలో యూఏఈ అత్యంత సమర్థవంతంగా పనిచేసిందనీ, ఈ క్రమంలోనే క్లిష్టమైన పరిస్థితుల్ని అధిగమించగలిగామని చెప్పారాయన. యూఏఈ అంతా ఒక్కతాటిపై నిలిచి, కరోనా పాండమిక్ పరిస్థితుల్ని ఎదుర్కొన్నట్లు వివరించారు.ఆగస్ట్ 24 నుంచి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజువారీగా కేవలం 1000 లోపు మాత్రమే నమోదవుతున్నాయి.కాగా, 100 శాతం వ్యాక్సినేషన్ దిశగా యూఏఈ అత్యంత వేగంగా పనిచేస్తోంది. ఆగస్ట్ 28 నాటికి 87 శాతం మందికి కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ అందించగా, 76 శాతం మందికి పూర్తి వ్యాక్సినేషన్ జరిగింది.దేశానికి అవసరమైన మెడికల్ పరికరాలు, మెడిసిన్స్ వంటివాటిని తయారు చేసుకోవడం సమకూర్చుకోవడంలో మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలని షేక్ హమదాన్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







