సానియా-హింగిస్ జంటకు నిరాశ
- March 14, 2016
ఇండియన్ వెల్స్ ఓపెన్ టోర్నీ కాలిఫోర్నియా (అమెరికా): వరుసగా రెండో ఏడాది ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు నిరాశ ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్స్ హోదాలో బరిలోకి దిగిన ఈ ఇండో-స్విస్ జోడీకి ఈసారి రెండో రౌండ్‌లోనే చుక్కెదురైంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-7 (7/9), 4-6తో వానియా కింగ్ (అమెరికా)-అలా కుద్రయెత్సెవా (రష్యా) జోడీ చేతిలో ఓడిపోయింది.గంటా 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా ద్వయం ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









