వ్యాక్సిన్ తీసుకోకుంటే విదేశీ ప్రయాణాలకు నో పర్మిషన్
- August 30, 2021
కువైట్: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని పౌరుల ప్రయాణాలకు సంబంధించి కువైట్ ప్రభుత్వం ట్రావెల్ గైడ్ లెన్స్ అప్ డేట్ చేసింది. వ్యాక్సిన్ తీసుకోని వారికి విదేశీ ప్రయాణాలకు అనుమతి ఉండదని వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపింది. అయితే..ఈ నిబంధన నుంచి రెండు వర్గాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హత లేని వయసు వర్గాల వారు..అంటే 12 ఏళ్లలోపు వయసు వారు, ఆరోగ్య కారణాల వల్ల టీకాలు వేయలేమని పేర్కొంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదించిన సర్టిఫికేట్ పొందిన పౌరులకు ప్రయాణ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే..గతంలో జారీ చేసిన నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ తీసుకొని గర్భిణీ స్త్రీలు విదేశాలకు వెళ్లడానికి అనుమతించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







