అక్టోబర్ 3 నుంచి హైవేలపై డెలివరీ బైక్ ల నిషేధం
- August 31, 2021
కువైట్: అక్టోబర్ 3 నుంచి హైవేలపై డెలివరీ బైక్ లను నిషేధిస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. డెలివరీ కంపెనీల ఫెడరేషన్ మీటింగ్ లో ట్రాఫిక్& ఆపరేషన్స్ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ, మేజర్ జనరల్ జమాల్ అల్-సయీగ్, రోడ్లపై డెలివరీ బైక్లకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం హైవేలపై డెలివరీ బైక్ లను నిషేధిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ జనరల్ డిపార్ట్ మెంట్ వెల్లడించిన వివరాల మేరకు ఫస్ట్ రింగ్ రోడ్, ఫోర్త్ రింగ్ రోడ్, ఐదవ రింగ్ రోడ్, సిక్స్త్ రింగ్ రోడ్, ఏడవ రింగ్ రోడ్, కింగ్ అబ్దుల్ అజీజ్ రోడ్ 30, కింగ్ ఫహద్ బిన్ అబ్దులాజీజ్ రోడ్ 40, కింగ్ ఫైసల్ బిన్ అబ్దులాజీజ్ రోడ్ 50, అల్-గజాలీ రోడ్ 60, జహ్రా రోడ్, గమల్ అబ్దేల్ నాసర్ రోడ్ (ఎగువ వంతెన), జాబర్ వంతెన రహదారుల్లో అక్టోబర్ 3 నుంచి డెలివరీ బైక్ లను అనుమతించారు. అలాగే వాహనదారుల భద్రత కోసం డెలివరీ బైక్ వెనక ఏర్పాటు చేసే బాక్స్ పై రిఫ్లెక్టివ్ లైట్ స్ట్రిప్స్ని ఏర్పాటు చేయాలని సూచించారు. డెలివరీ మోటార్సైకిలిస్టులు హెల్మెట్ ధరించాలన్నారు.
తాజా వార్తలు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు







