స్మార్ట్ ఫోన్లను దుర్వినియోగం చేస్తే ఏడాది జైలు, SR5,00,000 ఫైన్
- August 31, 2021
సౌదీ: స్మార్ట్ ఫోన్లను దుర్వినియోగం చేయటం ద్వారా ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించినా, వారి గౌరవానికి హాని కలిగించేలా వ్యవహరించినా ఏడాది జైలు శిక్ష, SR500,000 జరిమానా విధిస్తామని సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇతరుల గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరించిన కేసులో జరిమానాలను సమీక్షిస్తున్న సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇలా హెచ్చరించింది. పని ప్రదేశాలలో ఇతరుల గోప్యతకు భంగం కలిగేలా ఫోటోలు తీయటం, వారి గౌరవానికి నష్టం వాటిల్లేలా వ్యవహరించటం, నైతికతను ఉల్లంఘించడం వంటివి స్మార్ట్ ఫోన్ దుర్వినియోగం కిందకు వస్తాయి. నిందితుడు బాలనేరస్తుడైతే జువెనైల్ చట్టంలో నిర్దేశించిన జరిమానాల ప్రకారం అతడిని శిక్షించనున్నట్లు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







