యూఏఈ కు ప్రయాణం...వీరికి GDRFA & ICA అనుమతులు కావాలసిందే!

- August 31, 2021 , by Maagulf
యూఏఈ కు ప్రయాణం...వీరికి GDRFA & ICA అనుమతులు కావాలసిందే!

యూఏఈ: 10 ఆసియా మరియు ఆఫ్రికన్ దేశాల నుండి వచ్చే ప్రయాణికులు మినహా యూఏఈ వచ్చే నివాసితులు ఇప్పుడు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) లేదా ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ (ICA) ముందస్తు అనుమతి లేకుండా దుబాయ్‌కి వెళ్లవచ్చు. 

బంగ్లాదేశ్, ఇండియా, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఉగాండా, వియత్నాం మరియు జాంబియా నుండి ప్రయాణించే నివాసితులు యూఏఈ వచ్చే ముందు GDRFA మరియు ICA నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

అయితే, కొత్తగా జారీ చేసిన రెసిడెన్సీ వీసా, ఎంప్లాయిమెంట్ వీసా, షార్ట్ స్టే/లాంగ్ స్టే వీసా, విసిట్ వీసా లేదా 'వీసా ఆన్ అరైవల్' వీసా వంటి ఇతర వీసాలను కలిగి ఉన్న ప్రయాణీకులకు ఇది వర్తించదు.

పైన పేర్కొన్న 10 దేశాల నుండి వచ్చిన ప్రయాణీకులు ఆమోదించబడిన ఆరోగ్య సెంటర్లలో సాంపుల్ ఇచ్చిన 48 గంటలలోపు QR కోడ్‌తో కూడిన నెగటివ్ PCR పరీక్ష ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. వారు బయలుదేరిన ఆరు గంటలలోపు బయలుదేరే విమానాశ్రయంలో నిర్వహించిన ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ను (QR కోడ్‌ కలిగిఉన్న రిపోర్ట్) కూడా సమర్పించాలి.

ఈ 10 గమ్యస్థానాలు కాకుండా ఇతర దేశాల నుండి ప్రయాణించే ప్రయాణీకులు బయలుదేరడానికి 72 గంటల కంటే ముందు తీసుకున్న నెగటివ్ పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com