తాలిబన్ ప్రతినిధులతో భేటీ అయిన ఇండియన్ అంబాసిడర్
- August 31, 2021
దోహా: దోహాలో తాలిబన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు ఇండియన్ అంబాసిడర్ దీపక్ మిట్టల్.ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని కోరారు.అంతేకాదు ఆఫ్గన్ నుంచి భారతీయుల తరలింపును కూడా అడ్డుకోవద్దని సూచించారు.తాలిబన్లతో అధికార హోదాలో భారత్ చర్చలు జరపడం ఇదే తొలిసారి.
తాలిబన్ నాయకులతో ఇండియన్ అంబాసిడర్ దీపక్ మిట్టల్ మంగళవారం సమావేశం అయ్యారు.ఖతార్‌లోని తాలిబాన్ రాజకీయ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.ఈ మావేశంలో ఆ దేశ నాయకుడు షేర్ మహ్మద్ అబ్బాస్‌ను ఇండియన్ అంబాసిడర్ దీపక్ మిట్టల్ కలిశారు.
అయితే గత కొద్ది రోజులుగా తాలిబన్ నాయకులు భారత్‌ను కోరుతున్నారు.ఈ మేరకు దోహాలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరుల భద్రతతోపాటు అక్కడే చిక్కుకున్నవారు తిరిగి రావడంపై చర్చలు జరిగాయి.
ఇదిలా వుంటే.. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఎవరైనా సంతోషంగా ఉన్నారు అని చెప్పుకోవాల్సి వస్తే అది పాకిస్థాన్ మాత్రమే. తాలిబన్ ప్రభుత్వానికి ప్రపంచ దేశాల మద్దతు మూటగట్టడానికి.. ప్రత్యేకించి ఇస్లామిక్ దేశాలన్నిటినీ తాలిబన్లకు దగ్గర చేయడానికి చర్యలు ప్రారంభించింది పాకిస్తాన్. ఇందులో భాగంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి అనేక దేశాలకు ప్రత్యేకించి ఆఫ్ఘనిస్తాన్ పొరుగు దేశాలకు వెళ్లారు.
ఒక నివేదిక ప్రకారం, తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రపంచంలోని చాలా దేశాలు గుర్తించాలని, దీని ద్వారా ఇక్కడ తన ప్రభావాన్ని పెంచుకోవాలని పాకిస్తాన్ బలంగా కోరుకుంటోంది. మరోవైపు, భారతదేశంతో సహా చాలా దేశాలు ‘చూడండి..వేచి ఉండండి’ విధానాన్ని అనుసరిస్తున్నారనేది కూడా నిజం. ఆగస్టు 31 తర్వాత, చిత్రాన్ని దౌత్య స్థాయిలో క్లియర్ చేయడం ప్రారంభించవచ్చు.అప్పటికి విదేశీ సైనికులు.. పౌరులందరూ ఆఫ్ఘనిస్తాన్ నుండి బయటకు వెళ్ళిపోవడం పూర్తవుతుందని భావన.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







