హైదరాబాద్-జామ్ నగర్ మధ్య విమాన సర్వీసు ప్రారంభం

- August 31, 2021 , by Maagulf
హైదరాబాద్-జామ్ నగర్ మధ్య విమాన సర్వీసు ప్రారంభం

హైదరాబాద్: GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL), ఇటీవల హైదరాబాద్ నుండి జామ్‌నగర్‌కు స్టార్ ఎయిర్ విమాన సర్వీసును ప్రారంభించింది. ఇది టైర్ II, టైర్ III నగర ప్రయాణికులకు ఎయిర్ కనెక్టివిటీని అందించడం ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన UDAN కార్యక్రమం కింద దీనిని ప్రారంభించారు. 

స్టార్ ఎయిర్ విమానం OG 150 GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 03.20 కి బయలుదేరి, సాయంత్రం 05.20 జామ్‌నగర్ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో OG 149 జామ్‌నగర్ నుండి ఉదయం 9.15 గంటలకు బయలుదేరి, 11.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు జామ్‌నగర్ మధ్య వారానికి మూడు సార్లు - మంగళవారం, గురువారం మరియు శనివారం విమానాలు నడుస్తాయి.

GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ CEO, ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, "మేం ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కొత్త జామ్‌నగర్‌ విమాన మార్గం చిన్న పట్టణాలు నుంచి అలాంటి కనెక్టివిటీ కోసం ఎదురుచూస్తున్న వారి కోసమే. UDAN పథకం మొదటిసారి ప్రయాణించేవారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచింది. స్టార్ ఎయిర్‌కు మంచి ఆదరణ లభిస్తుందని మేం ఆశిస్తూ, మరిన్ని దేశీయ గమ్యస్థానాలకు సర్వీసులు ప్రారంభించడానికి ఎదురుచూస్తున్నాము." అన్నారు.

సిమ్రాన్ సింగ్ తివానా, CEO, ఘోడావత్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ (స్టార్ ఎయిర్) మాట్లాడుతూ, "స్టార్ ఎయిర్ ప్రాంతీయ కనెక్టివిటీకి అంకితం చేయబడింది.జామ్‌నగర్ ఒక ప్రధాన పారిశ్రామిక, MSME హబ్‌ మాత్రమే కాకుండా, ఇక్కడ జ్యోతిర్లింగాలు, ప్రపంచ ప్రఖ్యాత ద్వారకాధీష్ దేవాలయం కూడా ఉంది. డైరెక్ట్ ఫ్లైట్ ద్వారా హైదరాబాద్‌ను జామ్‌నగర్‌కి కనెక్ట్ చేయడం మాకు గర్వకారణం. సౌకర్యవంతమైన సీట్లు, అద్భుతమైన సేవను అందించే మా ప్రత్యేక జెట్ విమానం ద్వారా భవిష్యత్తులో హైదరాబాద్‌ నుంచి మరిన్ని గమ్యస్థానాలను విమాన సర్వీసులు ప్రారంభించాలని ఆశిస్తున్నాము’’ అన్నారు.

"జ్యువెల్ ఆఫ్ కథియావర్" గా ప్రసిద్ధి చెందిన జామ్‌నగర్, శతాబ్దాల నాటి అద్భుతమైన రాజభవనాలు, అందమైన దేవాలయాలకు నిలయం. గుజరాత్ రాష్ట్రంలోని గల్ఫ్ ఆఫ్ కచ్ తీరంలో ఉన్న జామ్ నగర్  బీచ్‌లు, వన్యప్రాణులు, సముద్ర జీవాలు మరియు ఆహ్లాదకరమైన కఠివాడి వంటకాలతో అలరిస్తుంది. 

హైదరాబాద్ దక్షిణ, మధ్య భారతదేశానికి ప్రవేశ ద్వారం లాంటిది ఇది చాలా మంది ఇష్టమైన, అతిపెద్ద రవాణా కేంద్రం. ఇది విజయవాడ, విశాఖపట్నం, నాగపూర్, భువనేశ్వర్, రాజమండ్రి, భోపాల్ మరియు తిరుపతి లాంటి సమీప నగరాల నుండి వచ్చిన ప్రయాణీకులకు అనుకూలంగా ఉంటుంది. 

స్టార్ ఎయిర్ అనేది ప్రముఖ భారతీయ వ్యాపార సంస్థ సంజయ్ ఘోడావత్ గ్రూప్ యొక్క విమానయాన విభాగం. ఈ గ్రూపు ఆగ్రో, ఏవియేషన్, మైనింగ్, రియాల్టీ, రిటైల్, ఎఫ్‌ఎంసిజి, ఎనర్జీ, ఎడ్యుకేషన్, సాఫ్ట్‌వేర్ మరియు టెక్స్‌టైల్స్ రంగాలలో తన ఉనికిని కలిగి ఉంది. స్టార్ ఎయిర్ భారతదేశమంతటా షెడ్యూల్డ్, అన్ షెడ్యూల్డ్ విమాన సేవలను అందిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com