భారత్ టూ యూఏఈ..ప్రయాణికులకు ఎయిర్ అరేబియా ట్రావెల్ ప్రోటోకాల్
- September 01, 2021
యూఏఈ: ఇండియాతో పాటు పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక నుంచి ఇ-వీసాలపై షార్జా, రస్ అల్ ఖైమా ప్రయాణించే వారికి సంబంధించి ట్రావెల్ ప్రోటోకాల్ ను ప్రకటించింది ఎయిర్ అరేబియా. ఈ నాలుగు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కోవిడ్ 19 వ్యాక్సిన్ రికార్డులను చూపించాల్సి ఉంటుందని వెల్లడించింది. అలాగే కొత్తగా జారీ చేసిన ఇ-వీసాలతో ఈ రెండు ఎమిరేట్స్‌కి వచ్చే ప్రయాణీకులందరూ తమ ప్రయాణానికి ముందు తప్పనిసరిగా ICA లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టం చేసింది. అబుదాబి, షార్జా, రాస్ అల్ ఖైమాతో పాటు ఇతర ఉత్తర ఎమిరేట్స్ నివాసితులు ICA వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దుబాయ్ రెసిడెంట్స్ అయితే ప్రయాణానికి ముందు GDRFA ప్లాట్‌ఫారమ్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకొని 14 రోజులు ముగిసిన తర్వాత ఈ నాలుగు దేశాల నుంచి వచ్చే రెసిడెంట్స్ కు అనుమతి ఉంటుందని, అయితే..వ్యాక్సిన్ సర్టిఫికెట్లతో పాటు అల్ హోస్న్ యాప్ లో గ్రీన్ స్టేటస్ ను చూపించాల్సి ఉంటుందని ఎయిర్ లైన్స్ వివరించింది.
వ్యాక్సిన్ తో సంబంధం లేకుండా కొన్ని రంగాల వారికి మినహాయింపు ఇచ్చారు. యూఏఈలో విధులు నిర్వహించే వైద్య సిబ్బంది(డాక్టర్లు, నర్సులు, టెక్నిషియన్లు)కి వ్యాక్సిన్ తీసుకున్నా, తీసుకోకున్నా యూఏఈకి ప్రయాణించొచ్చని ఎయిర్ లైన్స్ వెల్లడించింది. అలాగే విద్యా రంగానికి కూడా వెసులుబాట్లు కల్పించారు. యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లు, విద్యాసంస్థల టీచర్లు, ఇతర సిబ్బంది, యూఏఈలో చదువుతున్న స్టూడెంట్స్ వ్యాక్సిన్ రికార్డులతో సంబంధం లేకుండా ప్రయాణించొచ్చు. ఫెడరల్, స్థానిక సంస్థల ప్రభుత్వ ఉద్యోగులు, గోల్డెన్ వీసా హోల్డర్లు, దౌత్యవేత్తలతో పాటు..కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్లే వారికి మానవతా కోణంలో ప్రయాణానికి అనుమతి ఉంటుంది.
ఇండియా, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక ప్రయాణికులు ప్రస్తుతం మూడో దేశంలో 14 రోజుల క్వారంటైన్లో ఉన్నట్లైతే వారు ప్రయాణానికి ముందు UAE అధికారులను సంప్రదించి తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 14 రోజుల క్వారంటైన్ గడువు ముగియక ముందే ప్రయాణించాలనుకుంటే, వారు యూఏఈలోని సంబంధిత అధికారుల దగ్గర వివరాలను రిజిస్టర్ చేసుకొని తగిన అనుమతులు పొందాల్సి ఉంటుందని ఎయిర్ అరేబియా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







