డొమస్టిక్ వర్కర్ల రిక్రూట్మెంట్లో మోసాలు..13 మంది అరెస్ట్
- September 01, 2021
కువైట్: డొమస్టిక్ వర్కర్ల నియామకాలను అనధికారంగా నిర్వహిస్తున్న అఫీస్ పై రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ దాడులు నిర్వహించింది. ఈ అఫీస్ కేంద్రంగా రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘనలు జరిగినట్లు, నియామకాలు అనధికారికంగా, మోసపూరితంగా జరుగుతున్నట్లు గుర్తించి ఒక అరబ్ వ్యక్తిని అరెస్ట్ చేసింది. అలాగే రెసిడెన్సీ ఉల్లంఘనలకు పాల్పడిన 12 మంది అసియన్లను అదుపులోకి తీసుకుంది. రిక్రూట్మెంట్ ఆఫీస్ ముసుగులో నివాస అనుమతులు లేని వారికి ఆశ్రయం కల్పించటమే కాకుండా..కార్మిక చట్టాలకు విరుద్ధంగా నియామకాలను చేపడుతున్నట్లు అందిన సమాచారంతో సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వారిని సంబంధిత అధికారులకు అప్పగించటంతో పాటు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారిని దేశం నుంచి పంపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







