ఇండియా టూ కువైట్ డైరెక్ట్ ఫ్లైట్స్..వారానికి 5528 కేటాయింపు
- September 02, 2021
కువైట్: ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్లకు సంబంధించి కువైట్ డీజీసీఏ కొత్తగా సీట్ల కోటాను పెంచింది. వారానికి 5528 సీట్లను పరిమితం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇదే అంశంపై భారత పౌర విమానయాన శాఖకు కువైట్ డీజీసీఏ లేఖ రాసింది. ఇండియా నుంచి వచ్చే డైరెక్ట్ ఫ్లైట్లలో ప్రయాణికుల సంఖ్య పరిమితిని మంత్రి మండలి నిర్ణయించిన తర్వాత కువైట్ డీజీసీఏ ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం కువైట్‌కు మొత్తం 5,528 సీట్లు కేటాయించగా..ఆదివారం 656, సోమవారం 1,112, మంగళవారం 648, బుధవారం 648, గురువారం 1,088, శుక్రవారం 638, శనివారం 738 సీట్లు కేటాయించినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఇదిలాఉంటే గతంలో ఇండియా నుంచి వచ్చే డైరెక్ట్ ఫ్లైట్లలో వారానికి 760 సీట్లను మాత్రమే కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు గతంలో కన్నా 8 రెట్లు పెంచటం విశేషం.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







