ఇండియా టూ కువైట్ డైరెక్ట్ ఫ్లైట్స్..వారానికి 5528 కేటాయింపు

- September 02, 2021 , by Maagulf
ఇండియా టూ కువైట్ డైరెక్ట్ ఫ్లైట్స్..వారానికి 5528 కేటాయింపు

కువైట్: ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్లకు సంబంధించి కువైట్ డీజీసీఏ కొత్తగా సీట్ల కోటాను పెంచింది. వారానికి 5528 సీట్లను పరిమితం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇదే అంశంపై భారత పౌర విమానయాన శాఖకు కువైట్ డీజీసీఏ లేఖ రాసింది. ఇండియా నుంచి వచ్చే డైరెక్ట్ ఫ్లైట్లలో ప్రయాణికుల సంఖ్య పరిమితిని మంత్రి మండలి నిర్ణయించిన తర్వాత కువైట్ డీజీసీఏ ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం కువైట్‌కు మొత్తం 5,528 సీట్లు కేటాయించగా..ఆదివారం 656, సోమవారం 1,112, మంగళవారం 648, బుధవారం  648, గురువారం 1,088, శుక్రవారం 638, శనివారం 738 సీట్లు కేటాయించినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఇదిలాఉంటే గతంలో ఇండియా నుంచి వచ్చే డైరెక్ట్ ఫ్లైట్లలో వారానికి 760 సీట్లను మాత్రమే కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు గతంలో కన్నా 8 రెట్లు పెంచటం విశేషం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com