ఇరాన్ ఏ క్షణమైనా రాకెట్‌ను ప్రయోగించనుంది
- March 15, 2016
ఇరాన్ ఏ క్షణమైనా రాకెట్‌ను ప్రయోగించనుంది. మూడు దశల్లో ఆ రాకెట్ నింగికి ఎగరనున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఆ రాకెట్‌తో ఉపగ్రహాన్ని ప్రయోగించే అవకాశం కూడా ఉంది. ఇటీవల ఉత్తర కొరియా రాకెట్లను పరీక్షించిన తరహాలోనే ఇరాన్ కూడా ఆ దిశలో అడుగులు వేస్తోంది. ఖండాంతర క్షిపణులను ప్రయోగించే టెక్నాలజీని కూడా ఇరాన్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారమే ఆ దేశం రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఐక్యరాజ్యసమితి ఆంక్షలను ఉల్లంఘించి ఇరాన్ ఆ మిసైళ్లను ప్రయోగించినట్లు అమెరికా ఆరోపిస్తోంది. ఇజ్రాయిల్‌ను ధ్వంసం చేసే క్షిపణులను రూపొందించినట్లు ఇరాన్ ఏజెన్సీ కూడా ఇటీవల ప్రకటించింది.ఒకవేళ అణు ఒప్పంద నియమాలను ఇరాన్ ఉల్లంఘిస్తే ఆ దేశంపై చర్యలను తీసుకుంటామని ఇజ్రాయిల్‌కు అమెరికా అభయహస్తం ఇచ్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







