ఈడీ విచారణ కు హాజరైన నటి ఛార్మి

- September 02, 2021 , by Maagulf
ఈడీ విచారణ కు హాజరైన నటి ఛార్మి

హైదరాబాద్: 2017లో డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ విచారణ ఎదుర్కొన్న సినీనటి చార్మి..ఈరోజు మరోసారి ఈడీ అధికారుల ముందు హాజరయ్యింది. కెల్విన్‌ సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు చిత్రసీమలో కొంతమందిని విచారిస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాద్ ను అధికారులు విచారించడం జరిగింది. దాదాపు 10 గంటల పాటు పూరి జగన్నాథ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో పూరి జగన్నాథ్‌ బ్యాంక్ లావాదేవీలపై పూర్తిగా ఆరా తీశారు. ఆయనకు చెందిన మూడు బ్యాంక్ ఖాతాల నుంచి సమాచారం సేకరించారు. పూరి జగన్నాథ్‌ స్టేట్‌మెంట్‌ను లిఖిత పూర్వకంగా నమోదు చేసింది. భవిష్యత్తులో విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని అధికారులు ఆయనను ఆదేశించారు.

ఇక ఈరోజు ఈడీ అధికారుల ముందు నటి,నిర్మాత ఛార్మి హాజరైంది.ఛార్మి బ్యాంకు ఖాతాల వివరాలు, లావాదేవీలపై అధికారులు విచారణ కొనసాగించనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 12మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరిలో పూరీ జగన్నాథ్‌తో పాటు రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్‌ సింగ్, చార్మి, రవితేజ, నవ్‌దీప్, ముమైత్‌ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్, ఎఫ్‌–క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ కూడా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com