ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసిన కేసీఆర్
- September 02, 2021
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ కార్యాలయ నిర్మాణ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ భవనానికి శంకుస్థాపన చేశారు. గురువారం నాడు ఢిల్లీ చేరిన కేసీఆర్.. వసంత్ విహార్‌లో ఏర్పాటు చేయబోతున్న టీఆర్ఎస్ భవన్ పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేశారు. మొత్తం 1100 గజాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులతోపాటు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జిలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం సహా పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్‌లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్







