అరుణ గ్రహానికి చేరనున్న టిజీవో బైకనూరు
- March 15, 2016
రష్యా, ఐరోపా ఉమ్మడి ప్రయోగం అక్టోబర్‌లో అరుణ గ్రహానికి చేరనున్న టిజీవో బైకనూరు, అంగారక గ్రహంపై జీవజాలం ఆనవాళ్లు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు మరో బృహత్తర ప్రయత్నం మొదలైంది. ఇప్పటికే అమెరికాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహం ఉపరితలాన్ని అనేక కోణాల్లో శోధిస్తోంది. పలుమార్లు ఈ గ్రహ తొలిదశలో నీటి ఆనవాళ్లు ఉన్నాయన్న సంకేతాలను అందించింది. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా, ఐరోపాలు అరుణగ్రహంపై జీవజాతుల జాడకోసం ఉమ్మడి ప్రయత్నం చేపట్టాయి. ఇందులో భాగంగా సోమవారం విజయవంతంగా ఒక ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ (టిజివో)ను ప్రయోగించాయి. అనేక అత్యున్నత స్థాయి సాంకేతిక పరికరాలు కలిగిన ఈ ఆర్బిటర్ 496 మిలియన్ కిలోమీటర్ల మేర పయనించి ఏడు నెలల తర్వాత అంటే అక్టోబర్‌లో అంగారక గ్రహాన్ని చేరుకుంటుంది.రష్యాలోని కజకిస్తాన్‌లోగల బైకనూరు కాస్మోడ్రోమ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా విజయవంతంగానే దీన్ని పూర్తిచేశామని రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్ కాస్మోస్ తెలిపింది. మొత్తం రెండు దశలుగా ఐరోపా అంతరిక్ష పరిశోధనా సంస్థ, రష్యా రోదసీ సంస్థ ఈ అధ్యయనాన్ని చేపడతాయి. తొలిదశ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో రెండో ప్రయోగాన్ని కూడా త్వరలోనే చేపడతామని ఈ రెండు సంస్థలూ తెలిపాయి. ఎక్సోమార్స్ పేరిట ఈ ప్రయోగాన్ని మొదలుపెట్టామని వెల్లడించాయి. ఇంకా అంగారక గ్రహం 'సజీవంగా ఉందా లేదా' అన్నదే తమ ప్రయోగ లక్ష్యమని తెలిపాయి.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









