హైదరాబాద్ నుంచి కొలంబోకు డైరెక్ట్ విమాన సర్వీసులు పున:ప్రారంభం
- September 03, 2021
హైదరాబాద్: హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (GHIAL) నుంచి ఈ రోజు శ్రీలంకలోని కొలంబోకు నేరుగా విమాన సర్వీసును పున:ప్రారంభమయ్యాయి.దాదాపు ఒక సంవత్సరం, ఏడు నెలల విరామం తరువాత, శ్రీలంక ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుండి సర్వీసును తిరిగి ప్రారంభించింది. ఉదయం 9.55 గంటలకు హైదరాబాద్ నుండి కొలంబోకు 120 ప్రయాణీకులతో విమానం బయలుదేరింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, శ్రీలంక ఎయిర్ లైన్స్ ఉన్నతాధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు. హైదరాబాద్ - కొలంబో మధ్య వారానికి రెండుసార్లు-సోమవారం,శుక్రవారం-విమానాలు నడుస్తాయి.
జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సిఇఒ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, " అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటైన శ్రీలంకకు వెళ్లడానికి ప్రయాణికులంతా ఇష్టపడతారు.హైదరాబాద్-కొలంబోలను కలిపే ఈ నాన్‌స్టాప్ సర్వీసు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులను శ్రీలంకలోని అనేక అందమైన గమ్యస్థానాలకు చేరవేస్తుంది.శ్రీలంక ఎయిర్‌లైన్స్ తన సర్వీసులను తిరిగి హైదరాబాద్‌కు విస్తరించినందుకు మేము సంతోషిస్తున్నాము.కొత్త విమానానికి దక్షిణ భారతదేశ ప్రజల నుండి మళ్లీ ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాము. GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త అంతర్జాతీయ మార్గాలను అన్వేషించడం కొనసాగిస్తోంది. త్వరలో మరిన్ని నూతన గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ప్రారంభించడానికి మేం ఎదురుచూస్తున్నాము.’’ అన్నారు.
వి.రవీంద్రన్, రీజనల్ మేనేజర్, (ఇండియా, బంగ్లాదేశ్ మరియు నేపాల్) శ్రీ లంక ఎయిర్ లైన్స్, ‘‘ శ్రీలంక ఎయిర్ లైన్స్ కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు ప్రధానమైన మార్కెట్లు. త్వరలో ప్రయాణికుల డిమాంగ్ పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మేము తెలంగాణ నుంచి శ్రీలంక ఎయిర్ లైన్స్ సర్వీసుల ఫ్రీక్వెన్సీ మరియు కెపాసిటీ పెంచాలని యోచిస్తున్నాము’’ అన్నారు.
పచ్చని తోటలు, జలపాతాలు, ఉష్ణమండల బీచ్‌లు, వన్యప్రాణులు, చారిత్రక కట్టడాలు, దేవాలయాలు కలిగి యాత్రికులకు స్వర్గంలాంటి శ్రీలంక, భారతీయులకు ఇష్టమైన దేశాలలో ఒకటి. హనీమూన్ జంటలు, సాహస క్రీడా ప్రేమికులు, కుటుంబ సభ్యులందరికీ ఇది ఇష్టమైన గమ్యస్థానం.
హైదరాబాద్ దక్షిణ, మధ్య భారతదేశానికి ప్రవేశ ద్వారం లాంటిది. ఇది విజయవాడ, విశాఖపట్నం, నాగపూర్, భువనేశ్వర్, రాజమండ్రి, భోపాల్ మరియు తిరుపతి లాంటి సమీప నగరాల నుండి వచ్చిన ప్రయాణీకులకు అనుకూలంగా ఉంటుంది.
శ్రీలంక ఎయిర్‌లైన్స్ కొలంబోలోని శ్రీలంక జాతీయ క్యారియర్. నారో మరియు వైడ్-బాడీ ఎయిర్‌బస్ విమానాలను ఉపయోగించే శ్రీలంక ఎయిర్‌లైన్స్ ఆసియా మరియు ఉపఖండంలో ప్రాంతీయ సేవల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తూ, అలాగే మధ్యప్రాచ్యం,ఐరోపాలకు సేవలను అందిస్తుంది. శ్రీలంక ఎయిర్ లైన్స్ ఇటీవల నిర్వహించిన అపెక్స్ హెల్త్ అండ్ సేఫ్టీ ఆడిట్లో అత్యున్నతమైన ‘డైమండ్’ స్టేటస్ పొంది, ప్రయాణికుల భద్రత విషయంలో తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది.
తాజా వార్తలు
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్‌లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం









