ప్రమోద్ భగత్ కి పారాలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్.. భారత్‌కి 17వ పతకం
- September 04, 2021
టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కి నాలుగో గోల్డ్ మెడల్ దక్కింది. ఫురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ SL3 ఫైనల్లో శనివారం పోటీపడిన ప్రమోద్ భగత్ అద్భుత విజయంతో పసిడి పతకాన్ని గెలుపొందాడు. టోక్యో పారాలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కి ఇదే తొలి బంగారు పతకంకాగా.. మొత్తంగా భారత్ పతకాల సంఖ్య 17కి చేరింది.
ఈరోజు ఫైనల్లో గ్రేట్ బ్రిటన్‌కి చెందిన డేనియల్ బేతెల్‌తో తలపడిన ప్రమోద్ భగత్.. 21-14, 21-17 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. తొలి సెట్‌లో ఆరంభం నుంచి ఆధిక్యంలో కొనసాగించిన ప్రమోద్ భగత్.. డేనియల్‌కి పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు. కానీ.. సెకండ్ సెట్‌లో మాత్రం ఒకానొక దశలో 4-11తో ప్రమోద్ ఒత్తిడిలో కనిపించాడు. కానీ.. బ్రేక్ తర్వాత పుంజుకుని ప్రత్యర్థి నాలుగు పాయింట్లు సాధించలేలోపే ఏకంగా 13 పాయింట్లు సాధించి 17-15తో ఆధిక్యంలో వెళ్లాడు. ఆ తర్వాత సెట్‌ని ముగించడానికి కూడా ప్రమోద్ ఎక్కువ సమయం తీసుకోలేదు. అలానే ఫురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ SL3 కాంస్య పతక పోరులో భారత్‌కి చెందిన మనోజ్ సర్కార్ 22-20, 21-13 తేడాతో జపాన్ షట్లర్ పుజిహరాని ఓడించాడు.
పారాలింపిక్స్ పతకాల పట్టికలో 35వ స్థానంలో ఉన్న భారత్ జట్టు ఈ రెండు మెడల్స్ (బంగారం, కాంస్యం)తో 25వ స్థానానికి ఎగబాకింది. భారత్ ఖాతాలో ప్రస్తుతం మొత్తం 17 పతకాలు ఉండగా.. ఇందులో నాలుగు పసిడి, ఏడు రజతం, ఆరు కాంస్యం ఉన్నాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







