జర్మనీలోని బెర్లిన్లో బాంబు పేలుడు
- March 15, 2016
జర్మనీలోని బెర్లిన్లో బాంబు పేలుడు సంభవించింది. చార్లెట్టెన్బర్గ్ నుంచి బెర్లిన్ వెళ్తుండగా రద్దీగా ఉన్న రోడ్డుపై ఉన్నట్టుండి కారు పేలింది. ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. పేలుడు కారణంగా కారు పూర్తిగా ధ్వంసమైంది. దాదాపు అరకిలోమీటరు వరకు కారు భాగాలు ఎగిరి పడ్డాయి. కారులో పేలుడు పదార్థాలు అమర్చడం వల్లే పేలుడు సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఘటనలో ఇంకెవ్వరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. పేలుడు అనంతరం కారు మరో కారులోకి దూసుకుపోయిందని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!







