CII జాతీయ అవార్డులు గెలుచుకున్న హైదరాబాద్ విమానాశ్రయం

- September 06, 2021 , by Maagulf
CII జాతీయ అవార్డులు గెలుచుకున్న హైదరాబాద్ విమానాశ్రయం

హైదరాబాద్: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ  (CII), గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ (GBC)  నిర్వహించిన 'ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్' 22వ జాతీయ అవార్డులలో GMR ఆధర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిష్టాత్మక CII జాతీయ అవార్డులు ‘‘నేషనల్ ఎనర్జీ లీడర్’’ మరియు ‘‘ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియంట్ యూనిట్’’లను గెల్చుకుంది. ఆగస్టు 24–27 మధ్యన నిర్వహించిన 'ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్', 20వ ఎడిషన్, వర్చువల్ కాన్ఫరెన్స్ & ఎక్స్‌పోజిషన్ ఆన్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సందర్భంగా వీటిని ప్రకటించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ‘‘నేషనల్ ఎనర్జీ లీడర్’’ మరియు ‘‘ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియంట్ యూనిట్’’ అవార్డులను గెలుచుకోవడం ఇది వరుసగా మూడవ మరియు ఐదోసారి.  ఆగస్టు 27న, కార్యక్రమం చివరి రోజున పారిశ్రామిక ప్రముఖులు మరియు ఆహుతుల నడుమ  ప్రసన్న కుమార్ పోదార్, GHIAL హెడ్ – ఇంజనీరింగ్; విజయ్ రాథోడ్, హెడ్ – పీటీబీ ఇంజనీరింగ్ ఈ అవార్డులను అందుకున్నారు. 

తమ రోజువారీ కార్యకలాపాలలో ఉత్తమ పద్ధతులు మరియు సాంకేతిక పురోగతిని అవలంబిస్తూ, ఇంధనాన్ని పొదుపుగా ఉపయోగించే కార్యకలాపాలను ఈ వేదిక గుర్తిస్తుంది. ఈ పోటీలో పాల్గొన్న సంస్థలు చేపడుతున్న ఇంధన  పొదుపు చర్యలు, వినూత్నమైన ఆలోచనా ప్రక్రియలకు సంబంధించిన అనేక అంశాలను జ్యూరీ పరిశీలించింది. జ్యూరీ, CII సభ్యులు మరియు పారిశ్రామిక ప్రతినిధులు GHIAL  కార్యకలాపాలను ప్రశంసించారు.

గత మూడు సంవత్సరాల్లో, GHIAL సుస్థిరమైన ఇంధన సామర్థ్య చర్యలతో తన కార్యకలాపాలలో సుమారు  5.53 MU ల విద్యుత్తును ఆదా చేసింది. దీని వల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు చాలా తగ్గాయి. ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ యొక్క ఎయిర్ పోర్ట్ కార్బన్ అక్రెడిటేషన్ కింద హైదరాబాద్ విమానాశ్రయం లెవల్ 3+ “న్యూట్రాలిటీ”అక్రిడిటేషన్‌తో ‘కార్బన్ న్యూట్రల్’ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది.  

దీనిపై ప్రదీప్ పణికర్, సీఈఓ, జీహెచ్‌ఐఎఎల్, “ప్రయాణికుల సేవ చేయడంలో ఇంధన వనరులను సమర్థంగా ఉపయోగించుకోవాలనే మా నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనం. బాధ్యతాయుతమైన కార్పొరేట్‌ సంస్థగా, ఇంధన సామర్థ్యాలను సమర్థంగా వినియోగించుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాము. ఇంధన పొదుపు దిశగా మేము ప్రయాణికులం కోసం అనేక నూతన సాంకేతిక పరిజ్ఞానాలను, కోవిడ్ భద్రతా చర్యలను అమలు చేస్తున్నాము.’’ అన్నారు.

ఇంధన సామర్థ్య విధానాలను అవలంబించడంలో GHIAL ముందంజలో ఉంది. దీనిని అనేక పారిశ్రామిక వేదికలపై కూడా గుర్తించారు.   

ఇంధన సామర్థ్య రంగానికి ముఖ్యమైన మరియు వినూత్న పద్ధతులను ప్రోత్సహించేందుకు CII 'నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనెజ్మెంట్' అవార్డులను ప్రదానం చేస్తోంది. తద్వారా భారతీయ పరిశ్రమల ఇంధన సామర్థ్య మరియు సుస్థిరమైన వృద్ధిని సులభతరం చేస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com