తాలిబన్ల హస్తగతం అయిన పంజ్ షీర్

- September 06, 2021 , by Maagulf
తాలిబన్ల హస్తగతం అయిన పంజ్ షీర్

తాలిబ‌న్లు క‌లక ప్ర‌క‌ట‌న చేశారు.  పంజ్‌షీర్‌ను కైవ‌సం చేసుకున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు.  పంజ్‌షీర్ కైవ‌సంతో ఆఫ్ఘ‌నిస్తాన్ మొత్తం తాలిబ‌న్ల కైవ‌సం అయింది.  ఇక అమ్రుల్లా స‌లేహ్ ఇంటిని తాలిబ‌న్లు డ్రోన్ల‌తో పేల్చివేశారు.  పంజ్‌షీర్ రాజ‌ధానిలోని గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యంపై తాలిబ‌న్లు తెలుపు జెండాను ఎగ‌ర‌వేశారు.  ఎన్నో ద‌శాబ్దాలుగా ఈ ప్రాంతంపై ప‌ట్టు సాధించేందుకు తాలిబ‌న్లు తీవ్ర ప్ర‌య‌త్నం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ పోరులో తాలిబ‌న్లు పూర్వ‌మిత్రులైన అల్‌ఖైదా స‌హాయం తీసుకోవ‌డంతో విజ‌యం సాధించిన‌ట్టు స‌మాచారం.  మ‌రో రెండు మూడు రోజుల్లో ఆఫ్ఘ‌నిస్తాన్‌లో కొత్త ప్ర‌భుత్వం కొలువుదీర‌నున్న సంగ‌తి తెలిసిందే. 

పాకిస్తాన్ సాయం:
తాలిబన్లు పంజ్ షేర్ పై డ్రోన్లతో దాడి చేస్తుండటంతో రెసిస్టెంట్ ఫోర్స్ అలిసిపోతోంది. పంజ్ షేర్ సైన్యానికి సాయం అందించడంలో ప్రపంచ దేశాలు మొండికేస్తుండగా తాలిబన్లకు మాత్రం పాకిస్థాన్ బహిరంగగానే మద్దతు పలుకుతోంది. ఇన్నాళ్లు తాలిబన్లకు మేం సాయం చేయడం లేదని చెప్పిన దాయాది దేశం తాజాగా పంజ్ షేర్ కు డ్రోన్లను పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డ్రోన్లతో పంజ్ షేర్ సైన్యంపై దాడికి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో రెసిస్టెంట్స్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి ఫాహీమ్ దాస్తీ అమరుడైనట్లు వార్తలు వస్తున్నాయి.

తాలిబన్లతో కలిసి అధికారం పంచుకునేందుకు తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో దాస్తీ ఒకరు. యుద్ధంతో చిన్నాభిన్నామైన ప్రజలకు మంచి జీవితాలు అందించేందుకు తమ దళాలు చనిపోయేందుకు కూడా సిద్ధమేనని దాస్తీ ఒక సందర్భంలో వెల్లడించారు. గతంలోనూ ఈయన వెంట్రుకవాసిలో మృత్యువు నుంచి తప్పించుకున్నారు. 9/11దాడికి ముందు పంజ్ షేర్ నాయకుడు అహ్మద్ మసూద్ పై ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో మసూద్ తీవ్రంగా గాయపడి మృతిచెందారు. అయితే దాస్తీ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రస్తుతం పంజ్ షేర్ దళాలకు దాస్తీనే అధికార ప్రతినిధిగా ఉన్నారు. తరుచూ ఆయన సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తూ ఎన్ఆర్ఎఫ్సీ దళాల సమాచారాన్ని మీడియాకు అందిస్తున్నారు. ఇటీవల ఓ ఆంగ్ల ఛానల్ తో ఆయన మాట్లాడుతూ ‘మేం ప్రతిఘటిస్తూ మరణిస్తే.. అది మా విజయం అవుతుందని.. దేశం కోసం తుదిరక్తం చుక్క వరకు పోరాడిన యోధులుగా చరిత్రలో మా పేరు లిఖిస్తారు’ అంటూ వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన డ్రోన్ల దాడిలో దాస్తీతోపాటు అహ్మద్ షా మసూద్ మేనల్లుడు సాహిబ్ అబ్దుల్ వాదూద్ కూడా అమరులైనట్లు తెలుస్తోంది. తాము ఇద్దరు కీలక నాయకులను కోల్పోయినట్లు ఎన్ఆర్ఎఫ్ఏ ఫేస్ బుక్ పేజీలో ఆ దళవర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు అప్ఘన్లో యుద్దాన్ని ముగించాలని మతపెద్దలు ఇచ్చిన పిలుపునకు పంజ్ షేర్ దళాలు సానుకూలంగా స్పందించాయి. ‘ప్రస్తుత సమస్యను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధమేనని సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నామని.. తక్షణమే తాలిబన్లు పోరాటాన్ని నిలపివేసి చర్చలు జరుపాలని’ పంజ్ షేర్ అధినేత మసూద్ తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు. అయితే మతపెద్దల సూచనలపై తాలిబన్లు వెంటనే స్పందించలేదని తెలుస్తోంది. అంతేకాకుండా పంజ్ షేర్ దళాలకు సోషల్ మీడియా అందుబాటులో లేకుండా విద్యుత్, టెలిఫోన్, కరెంట్, ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేస్తున్నారు. దీంతో తాలిబన్లు ఏకపక్షంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com