యెమెన్ వైమానిక దాడుల్లో 41 మంది మృతి
- March 15, 2016
యెమెన్‌లోని ఉత్తరాది పట్టణమైన ముస్తబాపై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణదళాలు మంగళవారం జరిపిన వైమానిక దాడుల్లో 41 మంది పౌరులు మరణించారని వైద్య, గిరిజన వర్గాలు తెలిపాయి. హజ్జా ప్రావిన్స్‌లో ఈ దాడి జరిగింది. 41 మృతదేహాలు దవాఖానాకు వచ్చాయని డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థకు చెందిన ఓ వైద్యుడు తెలిపారు. మృతులంతా పౌరులేనని, వారిలో పిల్లలు కూడా ఉన్నారని ఆయన వివరంచారు. దాడుల్లో గాయపడిన 35 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని వైద్యులు చెప్పారు. ముస్తబాలోని మార్కెట్‌పై సంకీర్ణ దళాలు అనేకసార్లు బాంబులు కురిపించాయని స్థానిక అధికారులు, గిరిజన తెగల నాయకులు తెలిపారు.యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా ఇలాన్ మద్దతుతో సాయుధముఠాలు పోరాడుతున్నాయి. వారిపై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం దాడులు జరుపుతున్నది. యెమెన్ అంతర్యుద్ధానికి ఇప్పటివరకు 6,200 మంది బలయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







