ఒమాన్ లో 60 మందకి పైగా వలస కార్మికుల సమ్మె
- March 15, 2016ఒమాన్ లో 60 మందకి పైగా వలస కార్మికులు సమ్మె చేస్తున్నారు. కాంట్రాక్టులలో పేర్కొన్న విధంగా జీతాలు చెల్లించనందుకు, గత కొన్ని రోజులు ఆహారం సరఫరా నిలిపినందుకు నిరశనగా వారు ఈ దీక్ష ను కొనసాగిస్తున్నారు." మాకు సంస్థ నుంచి ఏ విధమైన చెల్లింపులు లభించడం లేదు. అంతేకాక, కంపెనీ మాకు ఏ రకమైన ఆహారం అందించడం లేదు. మేము ఆకలితో ఉన్నాం... ఆహారం లేకుండా ఎలా పనికి వెళ్ళగలమని ? ఒక రకంగా చెప్పాలంటే మేము ఇక్కడ ఇరుక్కుపోయామని " కొంతమంది కార్మికులు " ఒమన్ టైమ్స్ " కు తెలిపారు. అత్యంత మంది కార్మికుల ఒమాన్ రియళ్ళను 300 నుండి 500 ఒమాన్ రియళ్ళను భారతదేశం లోని నియామక సంస్థలకు డబ్బు మొత్తాన్ని చెల్లించిన తర్వాత ఒమాన్ కు వచ్చేరు. ఒప్పందంలో పేర్కొన్న విధంగా మాకు జీతం లభించడం లేదు. కొంతమందికి కొంత డబ్బు ఇచ్చారు. అత్యధిక శాతం మందికి ఏమీ ఇవ్వలేదని వలస కార్మికులు వాపోతున్నారు. మా ప్రధాన సమస్య ఏమిటంటే, మాకు ఆహారం అందడం లేదు.... మేము ఎంత కాలం ఆకలితో అలమటించాలని ? ఒక కార్మికుడు ప్రశ్నిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా... సంస్థ అధికారి ఒకరు కొందరికి కార్మికులకు సగం జీతం చెల్లించారు వారిని స్వదేశానికి తిరిగి పంపించే ప్రణాళికా లో ఇదొక భాగమని...అందుకే ఈ చర్య చేపట్టినట్లు వలస కార్మికులు కొందరు చెప్పారు. సగం జీతంమాత్రమే ఎందుకు చెల్లించారని వారిని అడగ్గా...ప్రస్తుతం అధికారిక సంస్థ ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని వారు తెలిపారు. అదేవిధంగా ఆహారం ఎందుకు ఇవ్వడం లేదని అడిగినప్పుడు, దీనిపై అధికారికంగా వ్యాఖ్యానించడానికి ఆ ఉన్నతాధికారి నిరాకరించారు. వలస కార్మికులు సంస్థ సరైన వసతి సైతం అందించ లేదని ఆరోపించారు. తాము ఉన్న ప్రతిచోటా ఛంఢాలమైన మురికి ఉందని వలస కార్మికులు చెప్పారు. అదేవిధంగా ఎయర్ కండిషనర్లు కోసం గోడలపై కొంత చోటును వదిలారని ...అయితే ఎయర్ కండిషనర్లు ఆ ప్రదేశంలో స్థిర పరచలేదని వలస కార్మికులు ఆరోపించారు. ఒక మస్కట్ ఆధారిత చట్ట సలహాదారు మాట్లాడుతూ, ఆ సంస్థ వలస కార్మికులకు జీతం చెల్లించక పోవడం ఒమన్ కార్మిక చట్టానికి ఇది వ్యతిరేక చర్య అని అన్నారు. "కంపెనీలు ఉద్యోగం ఒప్పంద విషయంలో ముందుగా కుదుర్చుకొన్న నిబంధనలు మరియు షరతులను అతిక్రమిస్తే అది నేరమని అన్నారు.అంతేకాక, జీతం మరియు ఆహారం చెల్లించకపోవడం ఒమాన్ కార్మిక చట్ట వ్యతిరేకమని మస్కట్ ఆధారిత చట్ట సలహాదారు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







