ఏపీ కరోనా అప్డేట్
- September 13, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.. దీనికి ప్రధానం కారణం టెస్ట్‌ల సంఖ్య కూడా తగ్గించడంగా చెప్పుకోవచ్చు.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,746 శాంపిల్స్ పరీక్షించగా.. 864 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 12 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. చిత్తూరులో నలుగురు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు మరణించారు. ఇక, ఇదే సమయంలో 1,310 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,73,63,641కు చేరుకున్నాయి.. ఇక, పాజిటివ్ కేసుల సంఖ్య 20,30,849కు పెరిగితే.. కోలుకున్నవారి సంఖ్య 20,02,187కు చేరుకుంది.. మరోవైపు ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 14,010కు పెరగగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,652 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, తాజా కేసుల్లో అత్యధికంగా నెల్లూరులో 141, తూర్పు గోదావరి జిల్లాలో 135, కడరపలో 117, ప్రకాశం జిల్లాలో 114, చిత్తూరులో 101 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి.
తాజా వార్తలు
- బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!
- ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్‌పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!









