డైరెక్ట్ విమానాల ప్రారంభంతో వారంలోనే 17,843 మంది ప్రయాణీకులు కువైట్‌కి రాక

- September 13, 2021 , by Maagulf
డైరెక్ట్ విమానాల ప్రారంభంతో వారంలోనే 17,843 మంది ప్రయాణీకులు కువైట్‌కి రాక

కువైట్: ఈజిప్ట్ మరియు ఇండియా నుంచి కువైట్‌కి డైరెక్ట్ విమానాల్ని అనుమతించిన వారం రోజుల్లోనే పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు కువైట్ చేరుకున్నారు. మొత్తం 174 విమానాలు ఈజిప్టు అలాగే ఇండియా నుంచి కువైట్ వచ్చాయి. వీటిల్లో 89 విమానాలు ఈజిప్టు నుంచి రాగా, 85 ఇండియా నుంచి వచ్చాయి. ఈ విమానాల్లో కువైట్ చేరుకున్న మొత్తం ప్రకాణీకుల సంఖ్య 17,843గా వుంది. ఈజిప్టు నుంచి 10,261 మంది, ఇండియా నుంచి 7,582 మంది కువైట్ చేరుకున్నారు. ఆయా దేశాల నుంచి ప్రయాణాల పై బ్యాన్ ఎత్తివేసిన తర్వాత క్రమంగా ఎయిర్ పోర్టు సామర్థ్యాన్ని పెంచుతూ వస్తున్నారు. అయితే, కట్టుదిట్టమైన రీతిలో కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రయాణీకులంతా పాటించేలా అథారిటీస్ చర్యలు తీసుకోవడం జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com