ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పులు
- September 14, 2021
ఖతార్: మినిస్టర్ ఆఫ్ మునిసిపాలిటీ మరియు ఎన్విరాన్‌మెంట్ మరియు యాక్టింగ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ డాక్టర్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ టుర్కి అల్ సుబై మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, మానవాళికి పెద్ద సవాలుగా మారినట్లు చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ఈ ప్రభావం తీవ్రంగా వుంటుందనీ, మానవ సంక్షేమంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం వుందనీ ఆయన అభిప్రాయపడ్డారు. ఖతార్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ 2021లో ఆయన మాట్లాడారు. ఎడ్యుకేషనల్ సిటీ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఖతార్ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అలాగే ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎన్జీ మరియు సస్టెయినబుల్ డెవలప్మెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వాతావరణ మార్పులపై తక్షణ చర్యలు తీసుకోవాలనీ, ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా ఈ అంశంపై ముందడుగు వేయాలని వారు పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకోసం ఖతార్ ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిందని, గ్రీన్ బిల్డింగ్స్, స్మార్ట్ గ్రిడ్స్, రీసైక్లింగ్, స్మార్ట్ ఫ్రేమింగ్ విధానాల్ని అవలంబిస్తోందని మినిస్టర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







