వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్‌, పీసీఆర్ రిపోర్ట్ ఉంటేనే ఎక్స్‌పో 2020కి ఎంట్రీ

- September 16, 2021 , by Maagulf
వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్‌, పీసీఆర్ రిపోర్ట్ ఉంటేనే ఎక్స్‌పో 2020కి ఎంట్రీ

యూఏఈ: కోవిడ్ నేప‌థ్యంలో ఎక్స్ పో 2020 ఎంట్రీపై యూఏఈ ప్ర‌భుత్వం అప్ డేట్ చేసిన గైడ్ లైన్స్ ప్ర‌క‌టించింది. ఎక్స్ పో 2020కి వ‌చ్చే సంద‌ర్శ‌కులు ఖ‌చ్చితంగా వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ గానీ, 72 గంట‌లలోపు తీసుకున్న పీసీఆర్ రిపోర్ట్ నుగానీ చూపించాల్సి ఉంటుంది. అయితే..ఇప్ప‌టికే ఎక్స్ పో టికెట్ కొనుగోలు చేసిన సంద‌ర్శ‌కులు టీకా వేసుకోకుండా, పీసీఆర్ టెస్ట్ కూడా చేయించుకోని ప‌క్షంలో ఎక్స్ పో ప్రాంగ‌ణంలో టెస్ట్ చేయించుకోవ‌చ్చు. ఎక్స్ పో ప్రాంగ‌ణంలోనే ప‌రీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న‌ట్లు సంబంధిత అధికారులు వెల్ల‌డించారు. ఎక్స్ పో టికెట్ ను చూపిస్తే ఫ్రీగా టెస్ట్ చేస్తారు. ఇక ఎక్స్‌పోలో పాల్గొనే అంత‌ర్జాతీయ వాలంటీర్లు, కాంట్రాక్టర్లు, సర్వీస్ ప్రొవైడర్లకు టీకాలు తప్పనిసరి. అలాగే కోవిడ్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం ప్ర‌భుత్వం సూచించిన అన్ని సూచ‌న‌లను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సి ఉంటుంది. ఆన్-సైట్ శానిటైజేషన్ స్టేషన్లు, ఫేస్ మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించ‌టం, రెండు మీటర్ల సామాజిక దూరాన్ని పాటించ‌టం వంటి నిబంధ‌న‌లు ఖ‌చ్చితంగా పాటించాల్సి ఉంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com