రువిలో అగ్నిప్రమాదం: 28 కుటుంబాల తరలింపు
- March 16, 2016రువిలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంతో రెస్క్యూ సిబ్బంది సకాలంలో స్పందించి, 28 కుటుంబాల్ని ఆ భవనం నుంచి ఖాళీ చేయించారు. బుధవారం తెల్లవారు ఝామున ఈ ప్రమాదం జరిగింది. ఏం జరిగిందనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సుమారు 2 గంటలపాటు ఫైర్ బ్రిగేడ్స్ అగ్ని కీలలతో పోరాటం చేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. గత వారం కూడా ముట్రాలో ఓ భవనం అగ్ని ప్రమాదానికి గురయ్యింది. రాయల్ ఒమన్ పోలీసులు వరుస అగ్ని ప్రమాదాలపై స్పందిస్తూ, భవనాల్ని నిర్మించడం, నిర్వహించడం వంటి విషయాల్లో అలక్షం ఈ ప్రమాదాలకు కారణంగా అభిప్రాయపడ్డారు. తగిన రక్షణ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయనీ, హోటళ్ళు, పోర్టులు, బ్యాంకులు ఇతర ప్రముఖ భవనాల్లో భద్రతా చర్యల విషయంలో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నామని రాయల్ ఒమన్ పోలీస్ అసిసె&ంట్ జనరల్ మేనేజర్ ఫర్ ఆపరేషన్స్ కల్నల్ సైద్ అల్ అస్మి చెప్పారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







