కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ
- September 16, 2021
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం కోహ్లీ కెప్టెన్ గా తప్పుకుంటున్నా రనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను కోహ్లీ ప్రతిపాదించారని వార్తలు వచ్చాయి. అయితే, బీసీసీ వర్గాలు ఆ వార్తను ఖండించాయి. కానీ, ఇప్పుడు స్వయంగా కోహ్లీ ట్వీట్ చేసారు. త్వరలో జరిగే టీ- ప్రపంచ కప్ తరువాత తాను టీ – 20 టీం కెప్టెన్ గా తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. టెస్టు- వన్డే లకు మాత్రమే తాను కెప్టెన్ గా ఉంటానని స్పష్టం చేసారు.
కొంత కాలంగా కోహ్లీ పైన భారీగా ఒత్తిడి పెరుగుతోంది. అన్ని సిరీస్ లకు కెప్టెన్ గా ఉండటంతో టీం గెలిచిన సందర్బాల్లో టీం గెలుపుగా..ఓడిన సందర్భాల్లో కోహ్లీ నిర్ణయాలే కారణంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో రానున్న ప్రపంచ కప్ ను కోహ్లీ తన కెరీర్ లో చివరి ప్రపంచ కప్ గా భావిస్తున్నారు. ఎలాగైనా తాను కెప్టెన్ గా కొనసాగితే ప్రపంచ కప్ సాధించి..గౌరవంగా టీం నుంచి తప్పుకోవాలని కోహ్లీ భావిస్తున్నారు. టీ-20 ఫార్మాట్ నుంచి తప్పుకోవటం ద్వారా కోహ్లీ మీద ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. కోహ్లీ తన నిర్ణయాన్ని ట్విట్టర్ లో పోస్టు చేస్తూనే..బీసీసీఐ కి లేఖ రాసారు. తన నిర్ణయానికి ముందు బీసీసీఐ ఛైర్మన్ గంగూలీ, కార్యదర్శి షా తోనూ చర్చించారు. వారికి తన అభిప్రాయం వెల్లడించారు.
ఇతర ప్రముఖ దేశాల క్రికెట్ లో ఒక్కో ఫార్మాట్ కు ఒక్కో కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కోహ్లీ సారధ్యంలో ఇప్పటి వరకు ప్రపంచ కప్ తో పాటుగా మరో రెండు వన్డే కీలక టోర్నమెంట్లు ఆడినా..అన్నింటా టీం ఇండియా ఓడిపోయింది. ఇదే సమయంలో అన్ని ఫార్మాట్ల బాధ్యత నిర్వహిస్తున్న సమయంలో..వ్యక్తిగత ఫాం పైన ప్రభావం చూపుతోంది. కోహ్లీ తన దైన ఇన్నింగ్స్ ను ఆడి చాలా రోజులు అవుతుంది. తన సహజశైలిలో బ్యాటింగ్ చేస్తూ.. టీంలో కొనసాగుతానంటూ కోహ్లీ తన లేఖలో పేర్కొన్నారు. అయితే, బోర్డు పెద్దలు సూచించగా..కోహ్లీ నిర్ణయం తీసుకున్నారా..లేక, విరాట్ సొంతంగా తీసుకున్న నిర్ణయమా అనేది తేలాల్సి ఉంది.
🇮🇳 ❤️ pic.twitter.com/Ds7okjhj9J
— Virat Kohli (@imVkohli) September 16, 2021
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







