ప్రవాస తెలుగు ఇంజనీర్ కు 'అభియనంతరశ్రీ ' విశిష్ట పురస్కారం
- September 16, 2021
దోహా: ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15, భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని, కర్ణాటక సంఘ ఖతార్, సామాజికంగా మరియు వృత్తిపరంగా భారతీయ సమాజానికి విశేష కృషి చేసినందుకు అభియనంతరశ్రీ విశిష్ట పురస్కారాన్ని ప్రధానం చేస్తారు.
2021 సంవత్సరానికి గాను ఖతార్ ప్రవాస తెలుగు ఇంజనీర్, కృష్ణ కుమార్ బంధకవికి "అభియనంతరశ్రీ" విశిష్ట పురస్కారం కోసం ఎంపికయ్యారు.
సెప్టెంబర్ 15న దోహా లోని ఇండియన్ కల్చరల్ సెంటర్,అశోక హాల్ ,ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో ఐసిసి అధ్యక్షుడు పిఎన్ బాబురాజన్, KSQ ప్రెసిడెంట్ నగేష్ రావు చేతుల మీదగా ఈ సత్కారం పొందారు.

తెలుగు కళా సమితి వ్యవస్థాపక సభ్యుడైన కృష్ణ కుమార్ బంధకవి ఖతార్‌లోని అనేక మంది భారతీయులకు కెకె గా సుపరిచితుడు,భారత్ టోస్ట్‌మాస్టర్స్ డివిజన్ గవర్నర్ గా,
ఐసిబిఎఫ్ మేనేజింగ్ కమిటీ సభ్యుడుగా మరియు రెండు సార్లు పని చేశారు ప్రస్తుతం ఐసిసి కార్యదర్శి గా కొన సాగుతున్నారు.
కెకె ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందినవారు, నిజామాబాద్ కు చెందిన రాధను వివాహం చేసుకుని హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఆయనకు ఒక కుమారుడు,కుమార్తె మరియు ముగ్గురు మనవళ్లు ఉన్నారు.
SMVM పాలిటెక్నిక్ తణుకులో మెకానికల్‌లో డిప్లొమా చదివి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా ద్వారా మెకానికల్‌లో AMIE పూర్తి చేశారు.ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రామగుండం, రిలయన్స్ ఇండస్ట్రీస్ బొంబాయి, ఖతర్గాస్‌లో ఇంజనీరింగ్ మరియు మేనేజ్‌మెంట్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు.ఖతార్ గాస్ నుండి పదవీ విరమణ చేసిన తరువాత, ASTRON సర్టిఫికేషన్‌లో జనరల్ మేనేజర్ అసెట్ ఇంటెగ్రిటీ సర్వీసెస్‌లో చేరారు.
కెకె మాట్లాడుతూ...తన ఇంజినీరింగ్ ప్రతిభతో అసాధారణ విజయం సాధించినవారిలో భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ మోక్షగుండం విశ్వేశవరయ్య జయంతి సందర్భంగా జరిగే ఇంజనీర్స్ డే రోజున ఈ సాత్కారం పొందినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







