టెలికాం కంపెనీలపై 4 రోజుల్లో 60 ఫిర్యాదులు
- March 16, 2016
టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించి సామాన్యుల నుంచి 60 ఫిర్యాదుల్ని అందుకున్నట్లు కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (సిఆర్ఎ) వెల్లడించింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ ఫిర్యాదులు అందినట్లు తెలియవస్తోంది. కన్స్యుమర్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ సిటీ సెంటర్ మాల్లో నిర్వహించగా, సిఆర్ఎ శనివారం నుంచి నిన్నటి వరకు ఓ 'బూత్'ని ఇందులో ఏర్పాటు చేసింది వరల్డ్ హ్యూమన్ రైట్స్ డేని పురస్కరించుకుని. బిల్లింగ్, నెట్వర్క్ కవరేజ్, రోమింగ్ ఛార్జీలు, డిస్కంటిన్యూయేషన్స్, స్పామ్, ప్రీమియర్ సర్వీసెస్, యాక్టివేషన్ మరియు ఇన్స్టలేషన్ విషయాల్లో అలసత్వం వంటి వాటిపైనే బఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. వినియోగదారుల సమస్యలను తెలుసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరిన్ని చేపట్టాలని సిఆర్ఎ నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. టెలికామ్ హాట్‌లైన్ 103 ద్వారా సిఆర్ఎని సులువుగా సంప్రదించవచ్చు. ట్విట్టర్, ఇ-మెయిల్ ద్వారా కూడా వినియోగదారులు సిఆర్‌ఎకు ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







