బీన్స్ గ్రేవీ కర్రీ

- June 05, 2015 , by Maagulf
బీన్స్ గ్రేవీ కర్రీ

కావలసిన పదార్ధాలు:

  • బీన్స్ ముక్కలు    - 2 కప్పులు
  • దాల్చిన చెక్క       - 1/2 అంగుళం ముక్క
  • యాలకులు         - 3
  • లవంగాలు           - 3
  • కారం                  - 3/4 టీ స్పూను
  • నూనె                  - 1 1/2 టేబుల్ స్పూను
  • ఉప్పు                 - తగినంత

గ్రేవీ కోసం:

  • ఉల్లిముక్కలు       - 1 కప్పు
  • టమాటో ముక్కలు - 1 కప్పు
  • అల్లం                 - అంగుళం ముక్క (సన్నగా తరగాలి)
  • జీలకర్ర                - 3/4 టీ స్పూను
  • మిరియాలు         - 4
  • కరివేపాకు            - 6 రెబ్బలు
  • కొత్తిమీర             – కట్ట

 

చేయు విధానం:

  • బాణీలో టేబుల్ స్పూను నూనె వేసి ఉల్లిముక్కలు వేసి వేయించి, టొమాటొముక్కలు, ఉప్పు వేసి ఉడికించాలి.
  • తర్వాత కారం వేసి ఓ రెండు నిమిషాలు వేయించి, చల్లారాక మిక్సీలో వేయాలి. వీటితో పాటు అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, మిరియాలు, ఓ కప్పు నీళ్ళు పోసి మెత్తగా రుబ్బాలి.
  • మరో బాణీలో మిగిలిన నూనె వేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఓ నిమిషం వేయించాక బీన్స్ ముక్కలు వేసి ఉప్పు చల్లాలి.
  • ఓ కప్పు నీళ్ళు పోసి మూతపెట్టి మధ్యమధ్యలో తిప్పుతూ ఉడికించాలి.
  • ముక్కలు ఉడికిన తర్వాత రుబ్బిన మసాలా వేసి సిమ్ లో గ్రేవీ చిక్క బడేవరకూ ఉడికించి దించాలి.

------ వి.జానకి జ్యోతి, సింగపూర్.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com