ఇజ్రాయిల్‌కి చెందిన 'డీప్ ఆప్టిక్స్' ...
- March 16, 2016
చూపులో ఏ మాత్రం తేడా వచ్చినా.. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్ష చేయించుకుంటాం. ఎదురుగా భిన్నమైన పరిమాణాల్లో ఉన్న అక్షరాలను చూపిస్తూ.. దృష్టి లోపం ఏ మేరకు ఉందో వైద్యులు నిర్ధారిస్తారు. అందుకు తగినట్టుగా.. కళ్లజోడు ఉపయోగించమని చెబుతారు. వాటికి ప్రత్యామ్నాయంగా కళ్లలో అమర్చుకోగలిగేలా.. ఐ లెన్సులను ఇటీవల వినియోగిస్తున్నారు. తాజాగా దృష్టిలోపానికి తగినట్టుగా ఫోకస్‌ను మార్చుకునే సరికొత్త కళ్లజోడు అందుబాటులోకి రాబోతుంది.ఇజ్రాయిల్‌కి చెందిన 'డీప్ ఆప్టిక్స్' అనే స్టార్టప్ కంపెనీ ఈ తరహా కళ్లజోడును తయారుచేస్తోంది. ఈ కళ్లజోడు చూసేందుకు సాధారణ కళ్లజోడులాగే కనిపిస్తుంది. అయితే దీన్ని ధరించిన వారు చదవడానికి... చూడానికి దేనిపైనైనా దృష్టి సారించినప్పుడు వారి దృష్టిలోపాన్ని బట్టి ఫోకస్‌ను స్వయంగా నియంత్రించుకొనే అవకాశం ఉంది. వారికి అనుగుణంగా.. బాగా కనిపించేలా ఈ కళ్లజోడు మారిపోతుంది. ఎలా అంటే.. కళ్లజోడు ఫ్రేమ్‌లో ఉన్న సెన్సార్లు.. కంటికి.. వస్తువుకు మధ్య ఉన్న దూరాన్ని పసిగట్టి అందులో అమర్చిన మినీ సెన్సార్‌కి అందజేస్తాయి. దీంతో ఈ ప్రాసెసర్.. కళ్ల అద్దాలపై ఉన్న లిక్విడ్-క్రిస్టల్ లేయర్‌ను వెలుతురుకు.. కంటికి అనుగుణంగా దాని ఫోకస్‌ను మార్చుకుంటుంది. దీంతో దృష్టిలోపం ఎంత ఉన్న వారైనా ఈ ఒక్క కళ్లజోడు ధరిస్తే చాలు. అయితే.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నమూనా దశలోనే ఉంది. త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







