కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 100,000 రియాల్స్ వరకు జరిమానా
- September 17, 2021
సౌదీ అరేబియా: సౌదీ అథారిటీస్, కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన పై తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని అధికారులు పేర్కొన్నారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉల్లంఘనకు పాల్పడేవారికి 100,000 రియాల్స్ వరకు జరిమానా విధిస్తారు.ఫేస్ మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వంటి వాటి ద్వారా కోవిడ్ 19 వ్యాప్తిని నివారించవచ్చు. ఆయా ఉల్లంఘనలకు 1,000 రియాల్స్ నుంచి జరిమానాలు మొదలవుతాయి. రెండోసారి ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా రెట్టింపు అవుతుంది. అలా అత్యధికంగా 100,000 రియాల్స్ వరకు జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది ఉల్లంఘనులు. కాగా, దేశంలో ఇప్పటిదాకా 546,251 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 8,460 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’









