ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు సంచలన లేఖ
- September 17, 2021
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. ఇదొక జంబో బోర్డ్ అంటూ విరుచుకుపడ్డారు. భక్తి భావంతో, స్వామి సేవలో తరించే వారికి బోర్డులో ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి.. సీబీఐ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు, అవినీతిపరులు, నేర చరిత్ర కలిగిన వారిని బోర్డులోకి తీసుకున్నారని ఆరోపించారు. వ్యాపార ధోరణిలో టీటీడీ జంబో బోర్డు ఏర్పాటు చేసి.. పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం అత్యంత బాధాకరం అన్నారు.
తిరుమలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదని మండిపడ్డారు. రాజకీయ నిరుద్యోగులకు ధర్మకర్తల బోర్డును కేంద్రంగా మార్చేశారని, జంబో బోర్డు ఏర్పాటులో స్వార్థ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. తిరుమల ప్రతిష్ఠత, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ ప్రభుత్వ చర్యలు ఉన్నాయంటూ జగన్‌కు లేఖ రాశారు చంద్రబాబు. మరోవైపు సామాన్య భక్తుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లంతా ఏడాది పొడవునా దర్శనాలకు వస్తుంటే.. ఇక సామాన్యులు శ్రీవారిని అరక్షణమైనా చూడగలరా అని ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







