తెలంగాణలో మరో మూడు కొత్త పరిశ్రమలు

- September 17, 2021 , by Maagulf
తెలంగాణలో మరో మూడు కొత్త పరిశ్రమలు

హైదరాబాద్: తెలంగాణలో మరో మూడు కొత్త పరిశ్రమలు. రూ.887 కోట్ల పెట్టుబడులు. 3 ఆధునిక జూట్‌ మిల్లుల ఏర్పాటుపై మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి, గంగుల సమక్షంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ MOU కుదుర్చుకున్నారు. జూట్‌ మిల్లుల ఏర్పాటుతో 10 వేల 4 వందల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జూట్‌ ఉత్పత్తులు ఉపయోగపడతాయని చెప్పారు కేటీఆర్. ఈ ఒప్పందం ప్రకారం కామారెడ్డి, వరంగల్‌, సిరిసిల్ల జిల్లాల్లో జూట్‌ మిల్లులను ఏర్పాటు చేయనున్నారు.

ఆదునిక జూట్‌ మిల్లుల ఏర్పాటుతో 10, 400 మందికి ఉపాధి లభిస్తుందన్నారు కేటీఆర్. జూట్‌ మిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, రాబోయే 20 ఏండ్లలో సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ ద్వారా జూట్‌ ఉత్పత్తులు కోనుగోలు చేస్తామన్నారు. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. వ్యవసాయ రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శమని కేటీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్‌తో వ్యవసాయ దిగుబడులు ఐదింతలు పెరిగాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ విజన్‌తో వ్యవసాయ దిగుబడులు ఐదింతలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో 10 వేల ఎకరాల్లో స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

మిషన్‌ భగీరథ పథకాన్ని దేశంలోని చాలా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్‌ విజన్‌కు నిదర్శనమన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్రానికి 50 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతాయన్నారు ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్. జూట్‌ మిల్లుల ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి గంగుల వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com