యూఏఈ: నేటి నుంచి ఐపీఎల్ రెండో సీజన్ ప్రారంభం
- September 19, 2021
యూఏఈ: యూఏఈలో నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్ సందడి మళ్లీ ప్రారంభం కాబోతోంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్.. ఈరోజు నుంచి కంటిన్యూ చేయనున్నారు. దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2021 రెండో సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈరోజు మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీ పడుతాయి. గతేడాది కూడా ఐపీఎల్ ను దుబాయ్ లోనే నిర్వహించారు. కరోనా కారణంగా ఈ సారి కూడా దుబాయ్, అబుధాబి, షార్జా స్టేడియంలలో ఐపీఎల్ మ్యాచులు జరుగుతాయి. రెండో సీజన్ లో భాగంగా మొత్తం 31 మ్యాచులు, 27 రోజుల్లో నిర్వహించనున్నారు. అక్టోబర్ 8న చివరి లీగ్ మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఉంటుంది. అక్టోబర్ 10న మొదటి క్వాలిఫయర్ మ్యాచ్, అక్టోబర్ 11, 13న షార్జా వేదికగా ఎలిమినేటర, క్వాలిఫైయర్2 మ్యాచులు నిర్వహిస్తారు.
ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్ జట్ల మ్యాచ్ తో ఐపీఎల్ 2021 రెండో భాగం స్టార్ట్ కాబోతోంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఆగిపోయిందనుకున్న ఐపీఎల్ 2021 తిరిగి ప్రారంభం కావడం, అది కూడా రెండు బలమైన జట్ల మధ్య మాచ్ తో రెండో భాగం స్టార్ట్ అవడం పట్ల క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. కాగా కరోనా నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను స్టేడియంలోనికి రానిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







