రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డూవేలం…
- September 19, 2021
హైదరాబాద్: బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయి ధరకు అమ్మకం జరిగింది. బాలాపూర్ లడ్డూ ను ఈ సారి కడప జిల్లా కు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మరియు మర్రి శశాంక్ రెడ్డి సొంతం చేసుకున్నారు.
ఏకంగా రూ. 18.90 లక్షల ధర పలికింది బాలాపూర్ లడ్డూ. ఇక బాలాపూర్ లడ్డు గెలుచుకున్న అనంతరం.. రమేష్ యాదవ్ మీడియా తో మాట్లాడారు. బాలాపూర్ లడ్డు ను గెలుచు కోవడం తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇవాళ గెలుచుకున్న బాలాపూర్ లడ్డు ను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తానని స్పష్టం చేశారు రమేష్ యాదవ్. 2019 వేలం కంటే లక్షా 30 వేల రూపాయలు ఈ సారి ఎక్కువ ధర పలికింది బాలాపూర్ లడ్డూ. ఇక లడ్డూ వేలం పాట అనంతరం.. బాలాపూర్ గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు కమిటీ సభ్యులు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







