ఇండియా నుంచి కువైట్ కు మరో రెండు కొత్త విమాన సర్వీసులు..

- September 19, 2021 , by Maagulf
ఇండియా నుంచి కువైట్ కు మరో రెండు కొత్త విమాన సర్వీసులు..

కువైట్ సిటీ: సుమారు ఏడు నెలల తర్వాత భారత్, కువైట్ మధ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దీంతో ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది. దీనిని దృష్టిలో పెట్టుకుని తాజాగా మరో రెండు కొత్త  విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఇరు దేశాలకు చెందిన విమానయాన సంస్థలు ప్రకటించాయి. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ(SVPI) విమానాశ్రయం నుంచి కువైట్ కు ఈ విమాన సర్వీసులు ఉంటాయి. ఎయిర్ ఇండియా, కువైట్ ఎయిర్‌లైన్స్ ఈ విమాన సర్వీసులు నడపనున్నాయి. 

అలాగే ఎస్‌వీపీఐ అధికారుల సమాచారం ప్రకారం లండన్‌కు కూడా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇరుదేశాల మధ్య కుదిరిన ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ఈ విమాన సర్వీసు నడిపిస్తున్నట్లు ఎస్‌వీపీఐ వెల్లడించింది. కాగా, అంతర్జాతీయ ప్రయాణాలు మొదలైన తర్వాత మొట్టమొదట ఈ ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్‌కు తొలి విమానం నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే రూట్‌లో ఇటీవల అదనంగా మరో సర్వీసును కూడా నడిపిస్తున్నట్లు ఎస్‌వీపీఐ యాజమాన్యం పేర్కొంది. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com