పంజాబ్ ముఖ్యమంత్రిగా సుఖ్జిందర్ సింగ్ రన్ధవా…
- September 19, 2021
చండీగఢ్: పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా సుఖ్జిందర్ సింగ్ రన్ధవాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.అమరీందర్ సింగ్ రాజీనామా తరువాత పంజాబ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్నటి రోజున మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ పేరు తెరమీదకు వచ్చింది. ఆ తరువాత అంబికాసోనీ పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరశీలించింది. అనేకమంది పేర్లను పరిశీలించిన అధిష్టానం సుఖ్జిందర్ సింగ్ రన్ధవాను ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటనను కూడా విడుదల చేసింది. కాగా, కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం అయ్యి రన్ధవాను తమ నాయకుడిగా ఎన్నుకోనున్నారు. మంత్రులు కూడా నిన్నటి రోజున రాజీనామా చేయడంతో కొత్త మంత్రివర్గంపై అప్పుడే కసరత్తులు మొదలయ్యాయి. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అమరీందర్ సింగ్ కొనసాగుతారా లేదంటే పార్టీ నుంచి పక్కకు తప్పుకొని భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెడతారా అన్నది చూడాలి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







