పీఆర్సీఐ ఎక్స్లెన్స్ అవార్డులు గెలుచుకున్న LTMRHL
- September 19, 2021
హైదరాబాద్: ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్( LTMRHL) అత్యంత ప్రతిష్టాత్మకమైన పీఆర్సీఐ(పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)ఎక్స్లెన్స్ అవార్డులు 2021 వద్ద ప్లాటినమ్ అవార్డును సోషల్ మీడియాను అత్యుత్తమంగా వినియోగించుకున్నందుకు గానూ మరియు బ్రాంజ్ అవార్డును అత్యుత్తమ సమాచారం– కోవిడ్19 కు అందించినందుకుగానూ అందుకుంది.ఈ అవార్డుల వేడుకను గోవాలో నిర్వహించిన 15వ అంతర్జాతీయ కమ్యూనికేషన్ కాంక్లేవ్ వద్ద అందజేశారు.
గోవా ప్రభుత్వ సాంస్కృతిక శాఖామాత్యులు గోవింద్ గౌడే చేతుల మీదుగా ఈ అవార్డులను ఎల్టీఎంఆర్హెచ్ఎల్ కార్పోరేట్ కమ్యూనికేషన్ హెడ్ అనిందితా సిన్హా అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎల్టీఎంహెచ్ఆర్ఎల్ ఎండీ అండ్ సీఈవో కెవీబీ రెడ్డి మాట్లాడుతూ ‘‘ పీఆర్సీఐ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డులను అందుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. మా వరకూ సామాజిక మాధ్యమం అంటే మా వినియోగదారులతో నేరుగా కనెక్ట్ అయ్యే అత్యుత్తమ మార్గం.మా బ్రాండ్ వాగ్ధానం మరింతగా మెరుగుపరుచుకునేందుకు ఇది తోడ్పడుతుంది. సామాజిక మాధ్యమాల ద్వారా మా వినియోగదారుల అంచనాలను మించిన రీతిలో సేవలనందించేందుకు ఓ నూతన దృక్పధంను కోవిడ్ 19 మహమ్మారి అందించింది. మా ప్రయత్నాలకు ఈ అవార్డులు చక్కటి గుర్తింపు’’ అని అన్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







