హై-ప్రొటీన్ ద్వారా బరువు తగ్గే అవకాశo
- March 16, 2016
ప్రొటీన్ ఆహార పదార్థాలు అనగానే ఎందుకులే. బరువు పెరిగిపోతామనుకుని చాలా మంది వాటికి దూరంగా ఉంటారు. నిజానికి హై- ప్రొటీన్ తీసుకోవడం ద్వారా బరువు తగ్గే అవకాశమే ఎక్కువ. దానికి కారణం హై - ప్రొటీన్ గల ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు వెంటనే కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. దీనివల్ల ఎక్కువగా ఏమీ తినలేకపోతాం. ఇది సహజంగానే బరువు తగ్గడానికి కారణమవుతుంది. ప్రొటీన్ ఆహారపదార్థాల పైన జరిగిన కొన్ని అధ్యయనాల్ని పరిశీలిస్తే ఇదిగో నిజాలు.బరువు పెరిగిపోతున్నామని అనిపించగానే ఎక్కువ మంది ఆహారంలో కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు తగ్గించుకునే ప్రయత్నంలో పడతారు. కానీ, ఇందులో ప్రొటీన్ పాత్రేమిటో చాలా మంది గుర్తించరు.శరీరం బరువు తగ్గించడంలో ప్రొటీన్ ఒక కీలక పాత్ర వహిస్తుందంటూ ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో బయటపడింది. అదనంగా ప్రొటీన్ తీసుకోవడం వల్ల త్వరగా కడుపు నిండినట్లయి, తక్కువగా ఆకలి వేస్తుంది. ఫలితంగా ఎక్కువ తినలేకపోతాం. తక్కువ ప్రొటీన్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు మనకు ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కువ మోతాదులో ప్రొటీన్ తీసుకున్నప్పుడు థెర్మోజెనెసిస్ అంటే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా జీవక్రియలు వేగంవంతమై అవసరానికి మించి తీసుకున్న క్యాలరీలన్నీ ఎప్పటికప్పుడు కరిగిపోతాయి. శరీరం బరువు తగ్గించే వైద్యచికిత్సల్లో డాక్టర్లు ప్రొటీన్ సప్లిమెంట్లు ఇవ్వడానికి గల కారణం ఇదే. హై-ప్రొటీన్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ఆరంభించిన వారు మూడు నుంచి ఆరు మాసాల్లోనే బరువు త గ్గడం కనిపిస్తుంది.
హై-ప్రొటీన్ ఎంతో ఉపకారి బరువు తగ్గడానికి నిర్దేిశించే ఆహార పదార్థాల్లో 20 నుంచి 30 శాతం క్యాలరీల దాకా ప్రొటీన్ నుంచే లభిస్తాయి. సగటున చూస్తే 15 శాతం క్యాలరీలు వారికి ప్రొటీన్ నుంచి లభిస్తాయి. సహజంగా ఆరోగ్యవంతమైన శరీరానికి రోజుకు 35 శాతం దాకా ప్రొటీన్ అవసరమవుతుంది. ప్రొటీన్ సమృద్ధిగా ఉండే చేపలు, మేక, కోడి మాంసం, వేరుశనగల వంటి వాటి నుంచి మనకు అవసరమైనంత ప్రొటీన్ లభిస్తుంది. చాలా మంది న్యూట్రిషనిస్టులు హై-ప్రొటీన్ ఆహారపదార్థాలు సూచించడానికి సందేహిస్తారు. కిడ్నీ సమస్యలు, గౌట్, ఎముకల సమస్యలు ఉన్నవారిని దృష్టిలో ఉంచుకోవడమే అందుకు కారణం. అయితే ఆ తర్వాత జరిగిన అధ్యయనాల్లో కిడ్నీ, గౌట్ వంటి సమస్యలు ఉన్నవారు హై ప్రొటీన్ ఆహార పదార్థం తీసుకోవడం వల్ల వచ్చే అదనపు సమస్యేదీ లేదని బయటపడింది. కాకపోతే, ఆ విషయంలో మరికొన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. అందువల్ల కిడ్నీ సమస్యలు ఉండి, 65 ఏళ్లు పైబడిన వారు లేదా అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు ఒకవేళ హై ప్రొటీన్ (25 శాతం క్యాలరీల కన్నా ఎక్కువగా ఉంటే) ఆహారం తీసుకోవాలనుకుంటే, ముందుగా డాక్టర్‌ను సంప్రదించడం చాలా అవసరం.
ఏక సూత్రం ఉండదు.!బరువు తగ్గడానికి అందరికీ ఒకే సూత్రం వర్తించదు. ఎవరికి ఏది ఉపయుక్తమో తమకు తామే నిర్ణయించుకోవాలి. కాకపోతే హై-ప్రొటీన్ ఆహార పదార్థాలు కొంచెం తినగానే కడుపునిండినట్లు అనిపించడం వల్ల ఎక్కువగా తినలేకపోతారు కాబట్టి బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రొటీన్ ఆహారంలో కూడా తక్కువ క్యాలరీలు ఉన్నవి అంటే, చేపలు, నట్స్, సోయా లాంటివి తీసుకుంటే మేలు. బరువు తగ్గడం అన్నది ఎంత వేగంగానైనా జరగవచ్చు కానీ, ఆ స్థితిని స్థిరంగా కొనసాగించడం ఆ తర్వాత చేయాల్సిన అతి ముఖ్యమైన పని. కేవలం హై-ప్రొటీన్ ఆహారం తీసుకోవడం ద్వారానే శరీరం బరువు తగ్గుతుందని కూడా కాదు. ప్రొటీన్ ఆహారంలోనూ తక్కువ క్యాలరీలు ఉన్నవి ఎంచుకోవడం అన్నింటికన్నా ముఖ్యమవుతుంది. అయితే ఈ జాగ్రత్తలన్నీ కేవలం బరువు తగ్గాలనుకున్న వారికి మాత్రమే కాదు. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారికి కూడా ఈ అనుసరణ అవసరమే.
ప్రొటీన్ పదార్థాలుప్రతి 100 గ్రాముల చేపలు, కోడి లేదా మేక మాంసంలో 22 గ్రాముల దాకా ప్రొటీన్ ఉంటుంది. ఒక కప్పు పాలల్లో 8 గ్రాములు, కప్పు పెరుగులో 10 నుంచి 13 గ్రాములు, ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. సగం కప్పు ఉడికించిన చిక్కుడు గింజల్లో 7 గ్రాముల దాకా ప్రొటీన్ ఉంటుంది. దాన్యాల్ని ఎవరూ పెద్దగా పరిగణనలోకి తీసుకోరు గానీ, వాటిలోనూ ఐదింట ఒక వంతు ప్రొటీన్ ఉంటుంది. కూరగాయల్లో కూడా ప్రొటీన్ ఉంటుంది. ఉదాహరణకు సగం కప్పు కాలీఫ్లవర్‌లో రెండు గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. మనం రోజూ సగటున తీసుకునే 2 వేల క్యాలరీల సాధారణ ఆహారం ద్వారానే 15 శాతం ప్రొటీన్ లభిస్తుంది. అలాగే రోజూ మనకు అందే 20 శాతం క్యాలరీలు మనం తీసుకునే ప్రొటీన్ నుంచే వస్తాయి. ప్రతి గ్రాము ప్రొటీన్‌లో 4 క్యాలరీలు ఉంటాయనే విషయాన్ని ఇక్కడ గమనించాలి.ప్రొటీన్ అందించే మరికొన్ని ఇతర ఆహార పదార్థాలు
సజ్జలు 11.6 శాతం జొన్నలు 10.4 శాతం రాగి 7.3 శాతం ఉప్పిడిబియ్యం 12.1 గ్రీన్ పీస్ 7.2 రాజ్మా 22.9 సోయాబీన్ 43.2 ఆలుగడ్డ 1.6 మునక్కాయలు 6.7 వేరుశనగలు 26.0 బాదం, కాజు 21.0 పుచ్చకాయగింజలు 34.0
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









