శ్రియ కి గోల్డెన్స్ ఛాన్స్...
- March 16, 2016
టాలీవుడ్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించిన సీనియర్ హీరోయిన్ శ్రియ గోల్డెన్స్ ఛాన్స్ కొట్టేసిందన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న ఈ భామ, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం బాహుబలి 2లో నటించనుందట. తొలి భాగంతో ఘనవిజయం సాధించిన బాహుబలి యూనిట్ సీక్వెల్ ను మరింత భారీగా తెరకెక్కించటానికి ప్లాన్ చేస్తోంది.బాహుబలి చిత్రంలో నెగెటివ్ రోల్ లో భల్లాలదేవుడిగా నటించిన రానాకు జోడీగా రెండో భాగంలో శ్రియ నటించనుందట. తొలి భాగంలో రానా కొడుకు పాత్రను మాత్రమే చూపించిన రాజమౌళి.. రెండో భాగంలో భల్లాలదేవుడి భార్యను కూడా చూపించనున్నాడు. కథలో కీలక సన్నివేశాల్లో కనిపించే ఈ పాత్రకు స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన యూనిట్ సభ్యులు ఈ పాత్రకు శ్రియను ఎంపిక చేశారు.అయితే ఇప్పటివరకు బాహుబలి సినిమాలో శ్రియ పాత్రపై యూనిట్ సభ్యుల అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేయకపోయినా, బాహుబలి 2లో శ్రియ అంటూ టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.ప్రభాస్, రానా లీడ్ రోల్స్ లో నటించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం బాహుబలి 2 నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న యూనిట్ ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి రీలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









